అన్వేషించండి

తుళ్ళూరులో 144 సెక్షన్ అమలు, ర్యాలీ చేపట్టిన జడా శ్రావణ్ కుమార్ అరెస్ట్

అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ క్షణం నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నానని అన్నారు జడా శ్రావణ్. జైలులో పెట్టినా, ఆస్పత్రి లో ఉన్నా దీక్ష కొనసాగుతుందన్నారు.

అమరావతిలోని తుళ్లూరులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండానే నిరసనలు చేస్తున్నారంటూ జై భీం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అమరావతి రాజదాని ప్రాంతం తుళ్లూరులో పోలీసలు అలర్ట్ అయ్యారు. హై సెక్యూరిటి జోన్ పరిధిలో ముందస్తుగా అనుమతులు లేకుండా నిరసనలు, ఆందోళనలు చేపట్టటంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. అంబేడ్కర్ స్మృతివనం వరకు జై భీం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్ పాదయాత్ర తలపెట్టారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై జడ శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను అడ్డంగా పెట్టుకొని రాజధాని భూముల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమాయకులను వంచించి మోసగిస్తోందని జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు.

హోటల్ నుంచి బయటకు రాగానే రౌండప్ చేసిన పోలీసులు..
అమరావతి రైతులకు మద్దతుగా పాదయాత్రకు బయలుదేరిన జడా శ్రావణ్ కుమార్ హోటల్ నుంచి బయటకు రాగానే పోలీసులు ఆయన్ని రౌండప్ చేశారు. అనుమతి లేదంటూ అరెస్టు చేసిన పోలీసులు, అక్కడ నుంచి నున్న పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ప్రభుత్వం, పోలీసులు తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన జడా శ్రావణ్, వైఫల్యాలు బయటపడతాయనే తమను అరెస్ట్ చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించామని చెప్పారు. పాదయాత్రను అడ్డుకుని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని, ఆర్ 5 జోన్ పై ప్రభుత్వం దుర్మార్గంతో వ్యవహరిస్తుందన్నారు. రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తే తప్పేంటిని ప్రశ్నించారు. జీవో నంబర్ ఒన్ రద్దు చేసినా తనను ఎలా అరెస్టు చేస్తారని జడ శ్రవణ్ అన్నారు.  

అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ క్షణం నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నానని అన్నారు. జైలులో పెట్టినా, ఆస్పత్రి లో ఉన్నా దీక్ష కొనసాగుతుందన్నారు. ఈ అరెస్టుపై సిఎం స్వయంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యమా, రాచరికమా అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలని, రైతులకు మద్దతు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వంలో నేరమా అని ప్రశ్నించారు. తనకు ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేశారని, నేటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యిందన్నారు. జగన్మోహన్ రెడ్డి దిగి వచ్చే వరకు ఆమరణ దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు.

పోటాపోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ర్యాలీ
రాజధాని ప్రాంతంలో జడా శ్రవణ్ పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో ఆయనకు పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ర్యాలీని తలపెట్టారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్థలాల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ర్యాలీకి దిగటంతో పోలీసుల అప్రమత్తం అయ్యారు. ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. రెండు నిరసన కార్యక్రమాలు తలపెట్టటంతో పోలీసులు ముందు జాగ్రత్తగా తుళ్ళూరు ప్రాంతంలో 144సెక్షన్ అమలులోకి తీసుకువచ్చారు. వరుస ఆందోళనలు నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. హై సెక్యూరిటి జోన్‌లో అనుమతి లేకుండా, ఎలాంటి నిరసనలు తలపెట్టినా చర్యలు కఠినంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
Embed widget