Southern population politics : దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
Southern States : జనాభా పెరిగితేనే దక్షిణాది ఉనికి నిలబడుతుందన్నట్లుగా చంద్రబాబు, స్టాలిన్ మాట్లాడుతున్నారు. నిజంగానే చైనా, జపాన్ తరహా పరిస్థితి దక్షిణాదికి వచ్చిందా ?
Southern population: ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న వారినే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత ఉండేలా చట్టం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అయితే ఆయన ఈ మాట సరదాగా ఉన్నారు. ఎక్కువ మంది పిల్లల విషయంలో చట్టం తీసుకురాకపోవచ్చు కానీ ఆయన చాలా కాలంగా పిల్లలను ఎక్కువ మందిని కనాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఈ అంశంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారు. అయినా చంద్రబాబు మాత్రం తన వాదన వినిపిస్తున్నారు. తాజాగా స్టాలిన్ కూడా అదే మాట అంటున్నారు. కనీసం ఒక్కో కుటంబం పదహారు మందిని కంటేనే డెమెగ్రాఫిక్ బ్యాలెన్స్ ఉంటుందని అంటున్నారు. ఈ లెక్క చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. నిజానికి ఇద్దరు సీఎంలు మాట్లాడింది దక్షిణాది కోణంలోనే. అంటే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో జనం తగ్గిపోతున్నారు. ఫలితంగా దేశంలో దక్షిణాది ప్రాధాన్యత తగ్గిపోతోంది.
దక్షిణాదిన తగ్గిపోయిన జనాభా
జనాభా విపరీతంగా పెరుగుతున్నప్పుడు ఇద్దరు పిల్లలు చాలు అని కేంద్ర ప్రభుత్వం క్యాంపెయిన్ నిర్వహించింది. అయితే నిషేధం మాత్రం పెట్టలేదు. తర్వాత ఒక్కరు చాలు అని కూడా చెప్పింది. పిల్లలు తక్కువగా ఉన్నప్పుడే కుటుంబ వృద్ది ఉంటుందని వారికి మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించవచ్చని అవగాహన కల్పించింది. ఈ విషయంలో దక్షిణాది ప్రజలు చైతన్యవంతులయ్యారు. జనాభాను నియంత్రించుకోగలిగారు. కానీ ఇప్పుడు అది మరింతగా పడిపోయింది. పలితంగా ఇప్పుడు జాతీయ సగటుతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబాల్లో తక్కువ మంది జనాభా ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఏపీలో అతి తక్కువ మంది ఉన్నారు. ఒక్కో కుటుంబంలోని సగటు సభ్యుల సంఖ్య 3.7 మాత్రమే ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ సగటు ప్రకారం ఓ కుటుంబంో 4.3 మంది ఉన్నారు. తమిళనాడు, తెలంగాణ 4.1 , కేరళలో 3.8 మంది ఉన్నారు. అదే ఉత్తరప్రదేశ్‌లో 5, బిహార్‌లో 4.8 వరకు ఉంది. అంటే అక్కడ కుటుంబాల్లో ఎక్కువ మంది జనాభా .. దక్షిణాదిలో తక్కువగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.
వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
యువ జనాభా తగ్గిపోతే అనేక సమస్యలు
జనాభా పెరుగుదల రేటు తగ్గుతోందని అంటే.. వృద్ధుల జనాభా పెరుగుతోందని అర్థం. అంటే పని చేసే జనాభా తగ్గుతోందని అనుకోవచ్చు. ఇది దేశాల ఉనికికే ప్రమాదం తెచ్చి పెడుతుంది. ఇంకా కొన్నాళ్ల తర్వాతా జపాన్ ఉంటుందా లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది. సౌత్ కొరియా, చైనా సహా అనేక దేశాలు తమ పౌరుల చేత పిల్లల్ని కనిపించడానికి ఎంత కష్టపడుతున్నాయో చెప్పాల్సిన పని లేదు. సంతానోత్పత్తి జాతీయ సగటు రేటు 2.0 కాగా, తెలంగాణలో అది 1.8 గా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్‌లో అది 1.7గా ఉంది. సంతానోత్పత్తి రేటు 1.8 కంటే తక్కువగా ఉంటే సంబంధిత దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం చూపుతుంది. అందుకే చంద్రబాబు ప్రజల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నంచేస్తున్నారు.
డ్రోన్ టెక్నాలజీకి నాలెడ్జ్ పార్టనర్‌గా ఐఐటీ తిరుపతితో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
రాజకీయ కారణాలు కూడా !
చంద్రబాబు, స్టాలిన్ జనాభా విషయంలో ప్రజల్ని చైతన్యవంతుల్నిచేసేందుకు ప్రయత్నించడానికి రాజకీయ కారణాలు ఉన్నాయి. మనది ప్రజాస్వామ్య దేశం. మెజార్టీ మీద ఆధారపడి ఉంటుంది. దేశానికి దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల నుంచి 30శాతం వరకూ జీడీపీ వస్తున్నప్పటికీ రాజకీయంగా లభించే ప్రాధాన్యం తక్కువే. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఒక్క యూపీ కింద మొత్తం దక్షిణాది కొరగాకండా పోతుందని అంటున్నారు. అందుకే దక్షిణాది ఉనికి నిలుపుకోవడానికి అయినా జనాభా పెరగాలని కోరుకుంటున్నారు.
అయితే జనాభా పెంచడం అనేది అభివృద్ది చెందిన దేశాలకే సాధ్యం కావడం లేదు. అక్కడి ప్రజలకు ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా ప్రజలు మాత్రం పిల్లల్ని పెంచలేమని అనుకుంటున్నారు. అయితే ఒక్కరు లేకపోతే అసలు వద్దనుకుంటున్నారు. అందుకే చంద్రబాబు, స్టాలిన్ కాదు కదా జిన్ పింగ్ బెదిరించినా ఎవరూ తమ నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు.