అన్వేషించండి

Amith Shah Vs KTR: కరప్షన్‌కు కెప్టెన్ -MODI! క్యాప్షన్- BJP! వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డ కేటీఆర్

తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ - కేటీఆర్పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్- కేటీఆర్

చేవెళ్ల సభలో కేంద్ర హోమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ వరుసబెట్టి ట్వీట్లు చేశారు. అందులో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పొలిటికల్ పంచులు విసిరారు. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో అధికారంలోకి కాదు.. బీజేపీ అంధకారంలోకే అని కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఖాళీ! ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ అని సెటైర్ వేశారు. 2024లో వైఫల్యాల మోదీకి గుజరాత్  ఘర్ వాపసీ తప్పదన్నారు. మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టే అనే బలమైన భావనలో ప్రజలున్నారని.. కారు స్టీరింగ్ కాదు.. బీజేపీ స్టీరింగే ఆదానీ చేతికి చిక్కిందన్నారు కేటీఆర్. కార్పొరేట్ దోస్తు కబంధ హస్తాల్లో కమలం  విలవిలలాడుతోందని.. హిండెన్ బర్గ్ రిపోర్టుతో బీజేపీ ఫుల్ పిక్చర్‌ని దేశప్రజలు 70 ఎంఎంలో చూశారని ఎద్దేవా చేశారు. ఇంకా ఏ ట్రయిలర్ అవసరం లేదని ట్వీట్ చేశారు.

తెలంగాణలో గల్లీ బీజేపీ నేతల పగటి వేషాలు నడవవు.. ఢిల్లీ పెద్దల పగటి కలలు నెరవేరవు అని కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. ఆదానీపై జేపీసీ వేయని బీజేపీకి.. సిట్టింగ్ జడ్జి విచారణ అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. ముక్కునేలకు రాసినా... మోకాళ్ల యాత్ర చేసినా... మోసాల మోదీని తెలంగాణ నమ్మదన్నారు కేటీఆర్. బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరప్షన్‌కు కెప్టెన్ మోదీ! క్యాప్షన్ బీజేపీ అన్నారు. MIM భుజంపై తుప్పుపట్టిన బీజేపీ తుపాకీపెట్టి ఎంతకాలం కాలుస్తారని విమర్శించారు. తెలంగాణలో సొంత బలం లేని పార్టీ బీజేపీ అని.. పల్లెపల్లెనా బలగం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు.

కేంద్ర నిధులు దుర్వినియోగమా ? బారాణా తీసుకుని చారాణా కూడా ఇవ్వని బీజేపికి మిగిలేది బూడిదే అన్నారు కేటీఆర్. అదానీ విషయంలో JPC కాదు కదా కనీసం SIT కూడా వేయని వారు అవినీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. గుజరాత్‌లో మోడీ హయాంలో మీరు హోం మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకుల్లో గుజరాత్ No - 1 గా ఉన్నమాట నిజం కాదా? అన్నారు. గత ఎనిమిది ఏళ్లలో గుజరాత్‌లో 13 సార్లు పేపర్ లీక్‌ కాలేదా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ దేశం లో వ్యాపం లాంటి అతి జుగుప్త్సా కరమైన స్కాం చేసింది మీ BJP పార్టీ ప్రభుత్వం కాదా? అటువంటి మీరు నిస్సిగ్గుగా సుద్దులు మాట్లాడం మీకే చెల్లిందని కేటీఆర్ ట్వీట్లో విమర్శించారు.

పీఎం కేర్స్‌ PM Caresలో ఎంత డబ్బు జమైంది? అది ఏ విదంగా ఖర్చు అయ్యిందో చెప్పని వారు CAG ఆడిట్ PM cares కు వర్తించదు అని నిస్సిగ్గుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిన వారు.. CAG మాత్రమే కాక అన్ని రకాల బ్యాంక్స్ ఆడిట్ల తో కట్టిన ప్రాజెక్టులపై మాట్లాడటం అవివేకం కాక మరి ఏమిటన్నారు కేటీఆర్. ఎనిమిది ఏళ్లుగా కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చకుండా, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించకుండా, ఇక్కడికి వచ్చి ఎవరో మీ గులాములు రాసిచ్చిన స్క్రిప్టును వల్లెవేస్తే నమ్మేదెవరని ట్వీట్ చేశారు.

హైదరాబాద్ ఐటీఐఆర్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, హైదరాబాద్ రెండో దశ మెట్రో ప్రాజెక్ట్, IIM , IISER , IIT , NID, నవోదయ , మెడికల్,  నర్సింగ్ కాలేజీలను శంకుస్థాపన చేసినందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు అని మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.  కృతజ్ఞతలు చెప్పిన కేటీఆర్... "ఆగండి... అవన్నీ ఆయన ఏమీ చేయలేదు" అని పేర్కొన్నారు. గత 9 ఏళ్లుగా పరిపాలనలో తెలంగాణ కంటే ఉత్తమ బీజీపీ పాలిత రాష్ట్రం ఏదైనా ఉంటే ఎందుకు చెప్పలేరు అమిత్ షా జీ అని కేటీఆర్ అంతకు ముందు ట్వీట్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
Embed widget