Buddha Venkanna : త్వరలో సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకు - బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు
Andhra Politics : సజ్జల రామకృష్ణారెడ్డి త్వరలో జైలుకు వెళ్తాడని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. చంద్రబాబు కుటుంబాన్ని తూలనాడిన ఎవర్నీ వదిలేది లేదని ఆయన హెచ్చరించారు.
Sajjala Ramakrishna Reddy will go to jail soon : ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి త్వరలో జైలుకు వెళ్తారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రకటించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారని.. ఆరా మస్తాన్ సర్వే ఏమైందో కూడా చూశారన్నారు. ఆరా మస్తాన్ ది కేవలం బెట్టింగ్ ల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే అన్నారు.
ఎవర్నీ వదిలేది లేదన్న బుద్దా వెంకన్న
ప్రజా వేదిక కూల్చిన దగ్గర నుంచి టీడీపీ పై పెట్రేగిపోయిన వైసీపీ నాయకులను వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళ కార్యకర్తలే తరిమికొట్టారని.. చంద్రబాబు కుటుంబం పై తప్పుడు విమర్శలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని ప్రకటించారు. చంద్రబాబుని అసెంబ్లీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫినిష్ చేస్తానని అన్నాడు. కానీ భగవంతుడు వైఎస్ ను లేకుండా చేశాడన్నారు. జగన్ కూడా చంద్రబాబు పై అనేక వ్యాఖ్యలు చేశాడు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దేవుడు చేశాడని గుర్తు చేశారు.
పవన్ ను విమర్శించారు.. ఇప్పుడేమయింది ?
చంద్రబాబు కుటుంబం రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని.. ఈ రోజు కేంద్రంలో కూడా చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్నాడు అంటే మాకు అంతకంటే ఆనందం లేదన్నారు. పవన్ ను మూడు పెళ్లిళ్లు అని విమర్శించాడు. కానీ ఇప్పుడు జగన్ కు రంకుమొగుడు అయి కూర్చున్నాడు. అదీ పవన్ కళ్యాణ్ అంటే అని సవాల్ చేశారు. జగన్, కేటీఆర్ ఇద్దరూ కలిసి పోటీ చేసినా లోకేష్ కు వచ్చిన మెజార్టీ రాలేదని గుర్తు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీలంతా లోకేష్ కు బ్రహ్మరథం పట్టారు. జగన్ బిసి ల వ్యతిరేకి అన్నారు.
త్వరలో సజ్జల జైలుకు
జగన్ ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిందే. ఇంక జగన్ జీవితం జైలుకేనని జోస్యం చెప్పారు. జగన్ మూడు జన్మలెత్తినా సరే తరగని శిక్షలు పడతాయని.. కానీ చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించిన ఈ కృష్ణా జిల్లాలో ఉన్న పిచ్చి కుక్కల్ని మాత్రం వదిలేది లేదన్నారు. త్వరలోనే సజ్జల రామకృష్ణరెడ్డి జైలుకు వెళ్తాడు. 2024 జూన్ 4 న తెలుగుదేశం పార్ 2 వచ్చింది. ఇప్పటి వరకూ ఉన్నది పార్ట్ 1. ఇంకో 45 సమవత్సరాలు టీడీపీ కి తిరుగు లేదన్నారు.