అన్వేషించండి

KTR: 'తెలంగాణ మాతృమూర్తులపై ఏంటీ దుర్మార్గం?' - ఆశ వర్కర్ల అరెస్టుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

Telangana News: తమ డిమాండ్ల సాధనకు నిరసన తెలుపుతున్న ఆశ వర్కర్లను పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

KTR Responds On Asha Workers Arrest: గ్రామ ప్రజలందరికీ మాతృమూర్తులుగా వ్యవహరిస్తోన్న తెలంగాణ తల్లులపై ఏంటీ దుర్మార్గం.? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల సాధనకు కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఆశ వర్కర్లపై (Asha Workers) పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'సీఎం రేవంత్.. ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా ? మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యమా ? ఏం పాపం చేశారని నడిరోడ్డుపై లాగిపారేస్తున్నారు ? దళిత, బహుజన ఆడబిడ్డలపై ఇంతటి అరాచకమా ? హోంమంత్రిగా ఉన్న మీకు ఆడవాళ్లంటే అంత చులకనా ? ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా ? ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ.. ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు మీ సర్కారు దాష్టీకానికి ఆశా నాయకురాలు.. సంతోషిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలి.. ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి లేకపోతే ఆశా వర్కర్ల ఆగ్రహజ్వాలను తట్టుకోలేరు.' అని పేర్కొన్నారు. అటు, మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఈ వ్యవహారంలో పోలీసులు, ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, ఇచ్చిన హామీ ప్రకారం తమకు రూ.18000 ఫిక్స్‌డ్ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని  కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఏడాది గడిచినా తమకు న్యాయం చేయడం లేదని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆశా వర్కర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏసీపీ శంకర్‌ను ఒక్కసారిగా ఆశా కార్యకర్తలు చుట్టుముట్టారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేశారు.

వారిని పోలీస్ స్టేషన్లకు తరలించేందుకు వాహనం ఎక్కిస్తున్న సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ చారిపై ఓ ఆశా కార్యకర్త చేయి చేసుకున్నారు. తాను చెయ్యి పెట్టినట్లు గమనించకుండా డోర్ వేయడంతో వెంటనే స్పందించిన ఆ ఆశా వర్కర్ సీఐ చెంప చెళ్లుమనిపించారు. వెంటనే స్పందించిన మహిళా పోలీసులు ఆశా వర్కర్‌ను కొట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహిళా కార్యకర్తలతో పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తారా.? అంటూ మండిపడ్డారు. అటు, పోలీసుపై చేయి చేసుకోవడాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది.

Also Read: Chennemaneni Ramesh: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget