అన్వేషించండి

Gujjula Premender Reddy: ఆదిలాబాద్ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పర్యవేక్షించారు. 

బీజేపీ ఎన్నికల శంఖారావం ఆదిలాబాద్ నుంచే ప్రారంభం అవుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఎంపి సోయం బాపురావ్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సభ ప్రాంగణాన్ని వేరు వేరు సమయంలో పర్యవేక్షించారు.  సాయంత్రం బిజేపి రాష్ట్ర ప్రధనకార్యదర్శి గుజ్జుల ప్రెమేందర్ రెడ్డి విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గాలికి వదిలేసి కేవలం తమ కుటుంబానికే అంతం అయిన తెలంగాణ పాలనను అరికట్టేందుకు ఆదిలాబాద్ జన గర్జన సభ నిర్వహిస్తున్నామన్నారు. 

ఆదిలాబాద్ పార్లమెంట్ నుండి రేపు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలివస్తున్నారనీ, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రచార సాధనాల్లో నగరంలో మరియు గ్రామాల్లోనూ ప్రచారం జరుగుతుందనీ, ఎన్నికల షెడ్యూల్ ఈరోజే రావడం భారతీయ జనతా పార్టీ ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా మొదటి సభ ఆదిలాబాద్ లో జరగడం చాలా సంతోషం,ప్రతి యేటా ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కి కలిసి వస్తుందనీ, ఈ నియంత పాలనను తరిమికొట్టి రాబోయే రెండు నెలల్లో తెలంగాణ లో కమలం వికసించబోతుందనీ తెలియజేశారు. 

సదస్సుకు అన్ని వర్గాల మేధావులను ఆహ్వనించి మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వారి నుంచి బీజేపీ సలహాలు తీసుకోనుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ఆదిలాబాద్‌ సభలో అమిత్‌ షా వివ రిస్తారని అన్నారు. కేసీఆర్‌కు హఠావో, బీజేపీకో జీతావో.. తెలంగాణకో బచావో... అనేదే బీజేపీ నినాదామని చెప్పారు.

ప్రధాని మోదీ దిష్టిబోమ్మలను ఎందుకు దగ్ధం చేస్తున్నారో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం రూ.9 లక్షల కోట్లు ఇచ్చినందుకా, ఇటీవల రాష్ట్రానికి పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ వంటివి ప్రకటించినందుకా, కృష్ణానదీలో తెలంగాణ నీటి వాటా ఖరారుకు ట్రిబ్యునల్‌ వేసినందుకా.. మోదీ దిష్టిబో మ్మలు దగ్ధం చేస్తున్నారు’అని నిలదీశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం మరోసారి తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం ఆదిలాబాద్ డైట్ కాలేజీ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 1న మహబూబ్ నగర్ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. దానికి కొనసాగింపుగా 3న నిజామాబాద్ లో బీజేపీ సభ నిర్వహించగా.. తాజాగా ఆదిలాబాద్లో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం సికింద్రాబాద్ లో జరిగే మేధావుల సదస్సులో పాల్గొని మేనిఫెస్టోలో చేరాల్సిన అంశాలపై సలహాలు తీసుకుంటారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ ఎన్నికలలో పాల్గొనే జాబితాను విడుదల చేసినట్లు సమాచారం అందుతోంది. 

ఎన్నికల ప్రచారమే ప్రధాన ఎజెండా

తెలంగాణలో పొలిటికల్ హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేయడంతో ప్రధాన పార్టీలు వారి వారి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణలో పాగా వేయడానికి విసృతంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ..అందుకు తగినట్లుగానే అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో బాగంగానే బుధవారంన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణలో పర్యటించనున్నారు. ముందుగా ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి ఆదిలాబాాద్ డైట్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే జనగర్జన బహిరంగసభలో పాల్గొంటారు.

ఆదిలాబాద్ సభ అనంతరం సాయంత్రం శంషాబాద్ లోనూ బీజేపీ మరో సభ నిర్వహించాలని తొలుత భావించింది. అయితే అది రద్దుకావడంతో సికింద్రాబాద్ సిఖ్ విలేజ్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో నిర్వహించే మేధావుల సభలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం రాత్రి బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు. పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జోగు రవి, ఆదినాథ్, ఆకుల ప్రవీణ్, గొర్ల రాము, సురేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Viral News: ఇద్దరు భర్తలు -  రెండు మంగళసూత్రాలు - ఒకే మంచం, ఒకే కంచం - ఈ మహిళ సతీలీలావతి కంటే ఎక్కువే
ఇద్దరు భర్తలు - రెండు మంగళసూత్రాలు - ఒకే మంచం, ఒకే కంచం - ఈ మహిళ సతీలీలావతి కంటే ఎక్కువే
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Embed widget