అన్వేషించండి

Bandi Sanjay Political Future: సస్పెన్స్‌లో బండి సంజయ్ పొలిటికల్ ఫ్యూచర్ - కేబినెట్ ప్రమోషన్ దక్కుతుందా? వివాదాలు అడ్డంకిగా మారతాయా?

Bandi Sanjay Cabinet Promotion 2026: బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాలు, పనితీరు , వివాదాల మధ్య ఆయనకు కేంద్ర కేబినెట్ ప్రమోషన్ దక్కే అవకాశం ఎంత?

Bandi Sanjay Son Controversy Impact:  తెలంగాణ బీజేపీలో  ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న బండి సంజయ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అమిత్ షా ,  మోదీల నమ్మకస్తుడిగా, హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించే నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, ఇటీవలి కొన్ని పరిణామాలు ఆయన ప్రమోషన్‌కు అడ్డంకిగా మారుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

 ప్రమోషన్ దక్కేనా.. వ్యూహాత్మక విరామమా? 

మోదీ 3.0 క్యాబినెట్‌లో ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కు త్వరలో జరగబోయే విస్తరణలో కేబినెట్ ర్యాంక్  దక్కుతుందనే ప్రచారం ఒకవైపు సాగుతోంది. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఆయన వేసిన పునాదులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఆయనకున్న క్రేజ్ దీనికి ప్రధాన కారణాలు. అయితే, ఈ సమీకరణాల్లో ఆయన కుమారుడికి సంబంధించిన కేసు పరిణామాలు హైకమాండ్ నిర్ణయంపై ప్రభావం చూపుతాయా అన్నది అసలు ప్రశ్న. ఒకవేళ ఆయనకు ప్రమోషన్ ఇస్తే, పార్టీ క్రమశిక్షణ కంటే  విన్నింగ్ హార్స్ కే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది.

 సామాజిక సమీకరణాలు – బండికి శ్రీరామరక్ష? 

తెలంగాణలో బలమైన మున్నూరు కాపు   సామాజిక వర్గానికి చెందిన నేత కావడం బండి సంజయ్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కిషన్ రెడ్డి,  ఈటల రాజేందర్ వంటి నేతలతో బ్యాలెన్స్ చేయాలంటే, బండి సంజయ్‌ను కేంద్రంలో కీలకమైన పదవిలో ఉంచడం ఢిల్లీ పెద్దలకు అనివార్యం. కేవలం పనితీరునే కాకుండా, 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టే సాహసం చేయకపోవచ్చు.

 వారసుడి కేసు  క్రమశిక్షణకు పరీక్ష 

బండి సంజయ్ కుమారుడు  పోక్సో కేసులో ఇరుక్కోవడం ఆయనకు సమస్యగా మారింది.  బీజేపీ ఎప్పుడూ  వారసత్వ రాజకీయాలకు ,  అక్రమాలకు వ్యతిరేకమని చెబుతుంటుంది. ఈ  వివాదం సమయంలో ఆయనకు కేబినెట్ ర్యాంక్ ఇస్తే, ఆరోపణలు ఉన్న కుటుంబ సభ్యుల పట్ల పార్టీ మెతక వైఖరి అవలంబిస్తోందనే సంకేతాలు వెళ్తాయి. ఒకవేళ ఇదే కారణంతో ఆయనను తప్పిస్తే లేదా ఉన్న పదవిలోనే ఉంచితే మాత్రం, అది సంజయ్ రాజకీయ ప్రస్థానానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

 సవాళ్లు - పార్టీలోని అంతర్గత పోటీ 

ఒకప్పుడు తెలంగాణ బీజేపీ అంటే బండి సంజయ్ అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు, రఘునందన్ రావు వంటి వారు కూడా రేసులో ఉన్నారు. ఈ క్రమంలో తన ఉనికిని కాపాడుకోవడానికి సంజయ్ తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. పార్టీపై ఎంతో నమ్మకంగా ఉన్నానని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అదిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా చేస్తానని ఆయన చెబుతున్నప్పటికీ, లోపల మాత్రం  ప్రమోషన్  కోసం గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.   జాతీయ స్థాయిలో కేబినెట్ మంత్రులుగా ఉండేవారికి కేవలం దూకుడు మాత్రమే కాదు, పరిపాలనా దక్షత కూడా ఉండాలని అధిష్టానం భావిస్తోంది. బండి సంజయ్ కేవలం  హిందుత్వ ఫేస్ గానే మిగిలిపోతారా లేక  అడ్మినిస్ట్రేటర్  గా గుర్తింపు తెచ్చుకుంటారా అనే దానిపైనే ఆయన పదోన్నతి ఆధారపడి ఉంటుంది.

 భవిష్యత్తు అడుగులు ఎటు? 


బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఒక సంధి కాలంలో ఉంది. సామాజిక సమీకరణాలు ఆయనను కాపాడుతాయా లేక వివాదాలు ఆయన వేగాన్ని తగ్గిస్తాయా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా, తెలంగాణలో బీజేపీ దూకుడు తగ్గకూడదంటే బండి సంజయ్ వంటి మాస్ లీడర్ కేంద్రంలో కీలక పాత్రలో ఉండటం పార్టీకి అవసరమేనని క్యాడర్ నమ్ముతోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget