Anantapur BJP Sabha : టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ పాలన చూశారు , బీజేపీకి ఓ చాన్సివ్వండి - అనంతపురంలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్
టీడీపీ, వైఎస్ఆర్‌సీపీకి చాన్సిచ్చారని ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆపార్టీ నేతలు ప్రజల్ని కోరారు. అనంతపురంలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ సభ నిర్వహించారు.
Anantapur BJP Sabha : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనకు ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేసేందుకు నిర్వహిస్తున్న గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి శోభా కరంద్లాజే అనంతపురంలో పర్యటించారు. కేంద్ర వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న శోభా కరంద్లాజే ముందుగా అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను తనిఖీ చేశారు. దేశాన్ని ఆత్మ నిర్మల్ భారత్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. దేశంలో ఆరు ఎయిమ్స్ లను కేటాయించగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి నిర్మించామని గుర్తు చేశారు. ఆరోగ్య భారతదేశంగా తీర్చిదిద్దాదానికి దేశ ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్ ను అందించే స్థాయికి భారతదేశాన్ని తీసుకొచ్చామన్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి ప్రధాని మోది అని ప్రశంసించారు.
Visited Super Speciality Hospital at Anantapur & interacted with medics on duty to inquire about the healthcare facilities made available to the public.
— Shobha Karandlaje (@ShobhaBJP) June 15, 2022
Upgraded under PM Swasthya Suraksha Yojana, this SSH provides quality-affordable diagnosis & treatment. #8YearsOfSeva pic.twitter.com/Ud0lx5RSVv
నగరంలోని సప్తగిరి సర్కిల్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనున్న శోభా కరంద్లాజేతో పాటు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్న ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గతంలో టీడీపీకి.. వైఎస్ఆర్‌సీపీకి అవకాశం ఇచ్చారని వారిరువురి పాలనలో రాష్ట్రంలో చూశారన్నారు. మోదీ పాలనలో అభివృద్ధిని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో చూడాలంటే, ప్రజలు బీజేపీకి ఓ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో @JaiTDP కి అవకాశం ఇచ్చారు, @YSRCParty కి అవకాశం ఇచ్చారు, వారిరువురి పాలనలో రాష్ట్రంలో చూశారు .@narendramodi గారి పాలనలోని అభివృద్ధిని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో చూడాలంటే, ప్రజలు @BJP4Andhra కి కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను (1/2) @blsanthosh pic.twitter.com/te0KIpaQoe
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) June 15, 2022
ప్రధాని మోదీ పాలనలో సాధించిన ఎనిమిదేళ్ల పాలన విజయాలను దేశవ్యాప్తంగాప్రచారం చేస్తున్నారు. ఏపీకి కూడా పలువురు కేంద్రమంత్రులు వస్తున్నారు. ఇటీవల విజయవాడలో కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ పర్యటించారు.