అన్వేషించండి

Amaravati Bill: అమరావతి చట్టబద్ధత బిల్లు - పార్లమెంట్ లో వైసీపీ వ్యతిరేకిస్తుందా ?

Amaravati Legalization Bill:అమరావతికి చట్టబద్ధత బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెస్తారని ప్రచారం జరుగుతోంది. తాము అమరావతికి వ్యతిరేకం కాదని మిథున్ రెడ్డి చెప్పారు. కానీ వైసీపీ పాలసీ అది కాదు.

Amaravati Legalization Bill YSRCP Will oppose  in Parliament : అమరావతి రాజధాని అంశం మరోసారి పార్లమెంటు వేదికగా చర్చకు వస్తోంది. రాజధాని నగరానికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అయితే అమరావతి రైతులకు న్యాయం  జరగాలన్నదే తమ విధానమని ఆయన పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అస్పష్టంగానే  న్యాయం  నిర్వచనం                              

వైసీపీ చెబుతున్న రైతులకు న్యాయం అనే మాటలో స్పష్టత కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతిని అనిశ్చితిలోకి నెట్టడం వల్ల రైతులే ఎక్కువగా నష్టపోయారు. ఇప్పుడు కూడా న్యాయం అని మాట్లాడుతున్నారే తప్ప, ఆ న్యాయం ఏ రూపంలో ఉండాలి.. తంలో కుదుర్చుకున్న ఒప్పందాల అమలునా లేక మరేదైనా కొత్త ప్రతిపాదననా అన్నది ఆ పార్టీ నేతలు వివరించలేకపోతున్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ఈ అస్పష్ట వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదన బలపడుతోంది.

వివాదమా? చట్టబద్ధతా?                             

రాజధానిపై పదేపదే వివాదాలు సృష్టించడం వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని  అందరి అభిప్రాయం.  గత కొన్నేళ్లుగా సాగుతున్న న్యాయపోరాటాలు, రాజకీయ ప్రకటనల వల్ల అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై, భూములు ఇచ్చిన రైతులు ఆర్థికంగా చితికిపోయారు. రాజధానిపై ఇంకా వివాదాలు సృష్టించడం వల్ల పెట్టుబడులు వెనక్కి పోవడమే తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీనికి భిన్నంగా, పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం ద్వారానే రైతులకు అసలైన భరోసా లభిస్తుంది. అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించడమే రైతులకు జరిగే అతిపెద్ద న్యాయం. చట్టబద్ధత ఉంటే ప్రభుత్వాలు మారినా రాజధాని మారదనే నమ్మకం ఏర్పడుతుంది. ఈ భరోసా వల్ల అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయి, భూముల ధరలు పెరుగుతాయి, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఒప్పందం ప్రకారం రైతులకు దక్కాల్సిన ప్లాట్లు, అభివృద్ధి చెందిన వాటాలు అప్పుడే విలువను సంతరించుకుంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యం                    

రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిని వివాదాల్లో ఉంచడం కంటే, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు ఒకే మాటపై నిలబడాల్సిన అవసరం ఉంది. అమరావతి రైతులకు న్యాయం జరగాలంటే అది వివాదాల ద్వారా సాధ్యం కాదు, కేవలం రాజ్యాంగబద్ధమైన రక్షణ ,వేగవంతమైన అభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుంది. పార్లమెంటులో రాబోయే బిల్లు ఈ దిశగా ఒక కీలక మలుపు అవుతుందని ఆశించవచ్చు. కానీ అది వైసీపీ విధానం మీదనే ఆధారపడి ఉంటుంది.        

 

టాప్ హెడ్ లైన్స్

Actress Trisha Controversy: త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
త్రిష చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం - డిప్యూటీ సీఎంను ను చేస్తారా?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Tesseract Company Land Allocation Controversy: రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?
రేవంత్ సోదరులే టార్గెట్‌గా బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్‌గేమ్ - టెస్సరాక్ట్ భూముల వివాదంలో కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget