News
News
వీడియోలు ఆటలు
X

YSRCP Internal Politics : వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ ! సొంత నేతలపైనే కుట్రలు జరుగుతున్నాయా ?

వైఎస్ఆర్‌సీపీలో కుట్రల పంచాయతీ జరుగుతోంది. ఒకరి తర్వాత ఒకరు సొంత పార్టీ నేతలే తమపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ మీడియా ముందుకు వస్తున్నారు.

FOLLOW US: 
Share:

YSRCP Internal Politics :  ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్‌సీపీలో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం శ్రుతి మించి సొంత పార్టీలో ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకునే దిశగా వెళ్తున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే మీడియా ముందుగా చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి కుట్రలు చేస్తున్నారని.. వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లా నేతలు ఇలా బహిరంగంగా చెప్పుకున్నారు. ఇంకా పలువురు నేతలు లోలోపల రగిలిపోతున్నారు. త్వరలో మరికొంత మంది బయటపడవచ్చని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. హైకమాండ్ జిల్లాలో నాయకుల మధ్య ఆధిపత్య పోరాటంపై తక్షణం దృష్టి పెట్టాలన్న సూచనలు చేస్తున్నారు. 

సొంత నేతల కుట్రలపై వైఎస్ఆర్‌సీపీ కీలక నేతల ఆరోపణలు

బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి మాత్రమే కాదు ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు కూడా. అలాంటి నేత తనపై వైఎస్ఆర్‌సీపీలోని పెద్ద నేతలే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆ పెద్ద నేతలెవరన్నది ప్రకాశం జిల్లాలో అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారందరికీ స్పష్టత ఉంది. ఆధిపత్య పోరాటంలో భాగంగానే ఇలా చేస్తున్నారని వారు నేరుగానే చెబుతూంటారు. పార్టీపై పట్టు కోసం..  బాలినేని ప్రాధాన్యాన్ని తగ్గించడానికి ఇలా చేస్తున్నారని అంటారు. అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తనను బలహీన పరచాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అంటున్నారు. నిజానికి ఆయనకు ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సరిపడదు. గతంలో ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకునేవారు. ఇది హైకమాండ్ వద్ద పెద్దపంచాయతీకే దారి తీసింది. ఇప్పుడు మరోసారి కోటంరెడ్డి మరోసారి అవే విమర్శలు చేస్తున్నారు. 

నేతల మధ్య ఆధిపత్య పోరాటమే కారణమా ?

పార్టీలో అంతర్గత రాజకీయాల కారణంగా పార్టీ నేతలను ఒకరికొకరు దెబ్బతీసుకునే వ్యూహాలను కొంత కాలంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసుకుంటున్నారని ఆ పార్టీ నేతుల చెప్పుకుంటున్నారు. ప్రతి జిల్లాలో దాదాపుగా సగం నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందంటున్నారు. పార్టీలో ముఖ్య నేతల వద్ద ప్రాపకం సంపాదించి ప్రత్యేకంగా వర్గం ఏర్పాటు చేసుకుని పోటీగా ఉన్న వారిపై పైచేయి సాధించడానికి వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్లే పార్టీ నేతలకు చెందిన అనేక రకాల వివాదాస్పద వ్యవహారాలు మీడియాలో హైలెట్ అవుతున్నాయన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ ఆడియోలతో పాటు ఇతర నేతలపై వస్తున్న పలురకాల అవినీతి, అవకతవకల వ్యవహారాలకు సొంత పార్టీ నేతలే కారణమన్న ఆరోపణలు వైఎస్ఆర్‌సీపీ నేతల్లోనే వినిపిస్తున్నాయి. 

హైకమాండ్ జోక్యం చేసుకోవాలని విన్నపం

పార్టీ నేతల మధ్య విభేదాలను సర్దుబాటు చేయకపోవడంతోనే ఇలాంటి సమస్య వస్తోందని.. తక్షణం  హైకమాండ్ కల్పించుకోవాలన్న అభిప్రాయం పార్టీ క్యాడర్‌లో వినిపిస్తోంది. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తల బాధ్యతలను విజయసాయిరెడ్డికి ఇచ్చారు. దీంతో నేతలు వర్గాలుగా విడిపోయి కొంత మంది సజ్జల వద్దకు.. మరికొంత మంది విజయసాయి వద్దకు వెళ్తూండటంతో పరిస్థితి మరితం జఠిలం అవుతోందని అంటున్నారు. పార్టీ అధ్యక్షుడు జోక్యం చేసుకుని సరి దిద్దకపోతే .. పార్టీకి నష్టం జరుగుతుందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. 

Published at : 28 Jun 2022 04:51 PM (IST) Tags: YSRCP balineni Kotamreddy Sridhar Reddy YCP Internal Politics

సంబంధిత కథనాలు

Delhi Liquor ScaM :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్ల టార్గెట్ ఎవరు ? కేజ్రీవాలా ? కవితనా ?

Delhi Liquor ScaM : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్ల టార్గెట్ ఎవరు ? కేజ్రీవాలా ? కవితనా ?

కాపీ చంద్రబాబు బిసిబేళ బాత్, పులిహోరా మేనిఫెస్టో వండారు, పత్తికొండలో సీఎం జగన్ ఆగ్రహం

కాపీ చంద్రబాబు బిసిబేళ బాత్, పులిహోరా మేనిఫెస్టో వండారు, పత్తికొండలో సీఎం జగన్ ఆగ్రహం

నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?

నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

Telangana New Party :  తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో వడగాడ్పులు, తెలంగాణలో తేలికపాటి వాన - ఐఎండీ

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో వడగాడ్పులు, తెలంగాణలో తేలికపాటి వాన - ఐఎండీ

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!