అన్వేషించండి
YS Sharmila Hunger Strike: ఈటల గడ్డపై వైఎస్ షర్మిల.. ఆ గ్రామంలో ఒకరోజు నిరాహార దీక్ష..
షర్మిల నిరాహార దీక్ష
1/8

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్‌టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ పోరాట దీక్ష కొనసాగుతోంది. ప్రతి వారం ఆమె ఒక్కో చోట చేస్తున్న నిరుద్యోగ పోరాట దీక్షలో భాగంగా నిరుద్యోగులకు మద్దతుగా ఇవాళ కూడా ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు.
2/8

మంగళవారం (ఆగస్టు10న) కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇటీవల ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న మహ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అతడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.
3/8

చనిపోయిన యువకుడు షబ్బీర్ ఇంట్లో కాసేపు ఉన్న షర్మిల అతని తల్లిదండ్రులతో మాట్లాడారు. షబ్బీర్ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువ పత్రాలను పరిశీలించారు.
4/8

ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోవడంతో షబ్బీర్ అనే యువకుడు రైలు కిందపడి గత వారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన వయసు పరిమితి కూడా దాటిపోవడంతో ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు.
5/8

షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం షర్మిల ఆ గ్రామంలోనే నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షర్మిల దీక్ష కొనసాగనుంది.
6/8

ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగులకు మద్దతుగా ఒకరోజు నిరాహార దీక్ష చేయడం సాధారణమే అయినా, ఈ సారి ఆమె ఈటల ప్రాతినిథ్యం వహించే హుజూరాబాద్ నియోజకవర్గంలో దీక్ష చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
7/8

ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్, టీఆర్ఎస్ మధ్య హోరా హోరీ మాటల పోరు అక్కడ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో షర్మిల దీక్ష చేస్తున్నారు.
8/8

అయితే, హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయబోమని షర్మిల గతంలోనే ప్రకటించారు. అసలు హుజూరాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఏముందని షర్మిల ఓ సందర్భంలో ప్రశ్నించారు.
Published at : 10 Aug 2021 01:02 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















