టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ నేతృత్వంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నాంపల్లి బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ ఆఫీసు మెరుపు ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌లో రైతులు నిరసన తెలుపుతుంటే మంత్రి వాహనం దూసుకెళ్లిన ఘటనలో 8 మంది చనిపోయారు. ఈ ఘటనపై బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నిలదీశారు.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ యూపీలోని లఖింపుర్ వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. బాధితులను కలుసుకుని పరామర్శించాలనే ప్రయత్నాన్ని అడ్డుకుని, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ అరాచక పాలన సాగుతుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్. ఈ క్రమంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దాంతో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. నేతలు, కార్యకర్తలను బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్ తో పాటు ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్, మెట్టు సాయి, వేణు గోపాల్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, తదితర కాంగ్రెస్ నేతలు సోమవారం నాడు బీజేపీ ఆఫీసు ముట్టడిలో పాల్గొన్నారు.
In Pics : ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన, క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పరామర్శ
In Pics : సిరిసిల్లకు కొత్త హంగులు, మినీ ట్యాంక్ బండ్, మినీ స్టేడియం అందుబాటులోకి
In Pics: తెలంగాణలో పేలిన ఎలక్ట్రిక్ బైక్, ఎలా ఉందో చూడండి - ఫోటోలు
In Pics : వరంగల్ లో కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ, హాజరైన రాహుల్ గాంధీ
Ramadan 2022 Photos: హైదరాబాద్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు - మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి