అన్వేషించండి

Pushpa 2 Theaters Seized: ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు సీజ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం

Allu Arjun Pushpa 2 Movie | ఏపీ సీఎం చంద్రబాబు ఇలాకా కుప్పం నియోజకవర్గంలో పుష్ప 2 థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడం అల్లు అర్జున్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

Pushpa 2 Theaters Seized in Kuppam | కుప్పం: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2 మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా తొలిరోజు దాదాపు రూ.280 కోట్లు రాబట్టి అల్లు అర్జున్ మూవీ సత్తా చాటింది. అయితే ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నారంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ఇలాకాలో పుష్ప 2 ప్రదర్శనకు అడ్డంకులు!
పుష్ప సినిమాపై ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో కక్ష్య సాధింపు చర్యలు అధికమయ్యాయని విమర్శలు వస్తున్నాయి. అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేస్తున్నారు. కుప్పంలో పుష్ప2 సినిమా షో నడుస్తుంటే   లక్ష్మి, మహాలక్ష్మి థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. టీడీపీ సీనియర్ నేతకు చెందిన 2 థియేటర్లకు అధికారులు తాళాలు వేయడంపై పట్టణంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

సినిమా థియేటర్ల లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా, ఎన్. ఓ .సి సర్టిఫికెట్ లేకుండా థియేటర్ నడుపుతున్నారంటూ అధికారులు ఆ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. పుష్ప-2 సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు తాళాలు వేయడంతో అల్లుఅర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. మూవీ రిలీజ్ అయ్యి హిట్ టాక్‌ తెచ్చుకుంటే, అధికారులు థియేటర్లను సీజ్ సరికాదని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభిమానులకు, ప్రేక్షకులకు సినిమాను దూరం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

థియేటర్ల సీజ్‌పై అధికారులు ఏమన్నారంటే..

రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడూ తనిఖీలు చేపట్టి.. పర్మిషన్ లేని థియేటర్లను సీజ్ చేయడం కొత్త విషయం కాదనేది అధికారుల మాట. థియేటర్లు నిర్వహించడానికి ఓనర్లు లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని రెవెన్యూ అధికారులు తెలిపారు. అన్ని వసతులు, సౌకర్యాలు, పర్మిషన్లు ఉన్నాయని చూపించి థియేటర్ యాజమాన్యం అధికారుల నుంచి ఎన్‌ఓసీ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా ఉన్న ఏ చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. అందులో భాగంగా థియేటర్లలో తనిఖీలు చేపట్టి, పర్మిషన్ లేని వాటిని మాత్రమే సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Pushpa 2: పుష్ప 2 థియేటర్లో మాస్ జాతర... కపాలం సీన్ రాగానే అమ్మవారు పూని, ఊగిపోయిన మహిళ - వీడియో వైరల్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Vishwanath And Sons Pre Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ బిగ్ ఓటీటీ డీల్ - రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు
విశ్వనాథ్ అండ్ సన్స్ బిగ్ ఓటీటీ డీల్ - రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget