అన్వేషించండి

Allu Arjun: ఫ్యాన్ వార్స్‌కు చెక్ పెడుతోన్న అల్లు అర్జున్... ఆర్మీకి అసోసియేషన్ హెచ్చరికలు - డేంజర్ బెల్స్ మొదలు

పుష్ప 2 మూవీ థియేటర్లలో విడుదలై విజయవంతంగా దూసుకెళుతోంది. ఈ విజయాన్ని కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తలకెక్కించుకుని చేస్తున్న అతికి, అల్లు అర్జున్ అండ్ టీమ్ హెచ్చరికలు జారీ చేసింది. అసలు విషయం ఏమిటంటే

అసలే సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు అన్నట్లుగా వార్ జరుగుతుంది. ఏపీలో మెగా ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్‌కి దూరమవుతున్నారు. ఆ విషయం పుష్ప 2 ఏపీ కలెక్షన్స్‌ చూస్తేనే అర్థమవుతుంది. నైజాంలో కలెక్షన్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన పుష్ప 2 చిత్రం.. ఏపీలో నార్మల్ సినిమాగానే ప్రదర్శింపబడుతుంది. అందుకు కారణం ఏమిటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ప్రతి ఈవెంట్‌లో తన స్టాండ్ ఏంటో క్లియర్‌గా చెబుతూనే ఉన్నాడు. ఎక్కడా మెగాకి వ్యతిరేకం అని ఆయన చెప్పలేదు. తనకి నచ్చిన పనిని చేస్తానని, నచ్చిన వారి కోసం ఏదైనా చేస్తానని చెబుతూ వస్తున్నాడు. ఇలాంటి టైమ్‌లో బన్నీ మాటల్ని తలకి ఎక్కించుకున్న కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలోనూ, టీవీ ఛానళ్లలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం మొదలెట్టారు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలను, మెగాభిమానులను టార్గెట్ చేస్తూ.. రాయడానికి వీలులేని పదజాలాన్ని వాడుతున్నారు. అలాంటి వారందరికీ తాజాగా అల్లు అర్జున్ టీమ్ హెచ్చరికలు జారీ చేసింది.

‘పుష్ప 2’ విడుదల తర్వాత కొన్ని ఛానల్స్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ పరిచయం చేసి స్పెషల్ డిబెట్‌లను స్టార్ట్ చేశాయి. ఇలా ఒక టిబెట్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్‌ని సదరు యాంకర్ సినిమాలోని ‘బాస్’ డైలాగ్ గురించి చెప్పి, అది మెగా ఫ్యామిలీకి అన్వయిస్తూ మాట్లాడుతుంటే.. కండించాల్సిన అల్లు అర్జున్ ఫ్యాన్.. ‘సినిమాని సినిమాలాగా చూడాలి. అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ సమాధానం ఇవ్వడంతో దానిపై పెద్ద రచ్చే నడుస్తుంది. ఇది అల్లు అర్జున్ వరకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అంతే వెంటనే.. ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి వార్నింగ్ ట్వీట్ వచ్చేసింది. ఈ పోస్ట్‌లో 

‘‘అల్లు అర్జున్ గారి తరుపున ఎవరైనా ఫ్యాన్స్ అని చెప్పుకొని టివి మరియు యుట్యూబ్ ఇంటర్వ్యూలు ఇచ్చినా, అది వారి వ్యక్తిగతం అంతే గాని వారి భావజాలానికి అధికారిక మద్దతు లేదా సపోర్ట్ ఉండదు. ఏ ఇతర హీరోల మీద లేదా రాజకీయంగా ఏ నాయకుల మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి చేసే కామెంట్స్ మేము సపోర్ట్ చేయం అలాంటి అభిమానులను దూరంగా ఉంచటం జరుగుతుంది’’ అని ప్రకటించారు. అంటే, అల్లు అభిమానులకు, ఆర్మీ అనుకునే వారికి అల్లు అర్జున్ నుండి వచ్చిన వార్నింగ్, డేంజర్ బెల్స్ అనేలా కొందరు ఈ పోస్ట్‌ను ప్రొజక్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా అడ్డదిడ్డమైన వాగుడు కట్టబెట్టి కాస్త పద్దతిగా నడుచుకోవాలనేది ఈ ట్వీట్ సారాంశంగా కొందరు బన్నీ డై హార్డ్ ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Also Readఅల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

నిజమే కదా.. సినిమా పాజిటివ్ తెచ్చుకుంది కాబట్టి సరిపోయింది లేదంటే.. మన హీరో పరిస్థితి ఏమిటి? మన ఫ్యాన్స్ పరిస్థితి ఏమిటి? ఇలాంటి విజయాలు వచ్చినప్పుడే అణిగిమణిగి ఉండాలని కొందరు బన్నీ ఫ్యాన్సే హితబోధ చేస్తుండటం గమనించవచ్చు. మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఫేక్ ప్రచారాన్ని చేస్తున్న వారికి వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ను విడుదల చేసింది. అందులో ‘‘ఊహాజనితమైన, సొంత క్రియేటివిటితో పుట్టించిన కొన్ని డైలాగులు ‘పుష్ప 2’ సినిమాలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ (కావాలని)గా కొంత మంది సినిమాపై నెగిటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోకపోతే అలాంటి వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పేర్కొంది.

Also Readనా కోసం కాదు, వాళ్ళ కోసం... ఆ మూడుసార్లూ Pushpa 2 హిట్టవ్వాలని బలంగా కోరుకున్నా - అల్లు అర్జున్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget