అన్వేషించండి
Nagarjun Sagar: సాగర్ గేట్లు ఓపెన్.. పోటెత్తుతున్న పర్యటకులు, ఆ సోయగాలు మీరూ చూసేయండి

విద్యుత్ కాంతుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు
1/12

నాగార్జున సాగర్ జలాశయం 590 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి చేరుకోవడంతో డ్యామ్ అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 5 లక్షల 14 వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తుంది.
2/12

1 లక్షా 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గేట్లు తెరుచుకోవడంతో నాగార్జున సాగర్‌కు పర్యటకులు పోటెత్తుతున్నారు.
3/12

దీంతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో ప్రాజెక్టు వద్దకు చేరుకొని కృష్ణమ్మ సోయగాలను జనం ఆస్వాదిస్తున్నారు.
4/12

ముఖ్యంగా రాత్రి వేళ విద్యుత్ కాంతుల్లో ప్రాజెక్టు మరింత శోభను సంతరించుకుంది.
5/12

నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. అయితే, ప్రస్తుతం 584 అడుగులకు నీరు చేరింది. ఇంకా ఇన్ ఫ్లో అధికం అవుతుండడంతో గేట్లు తెరిచారు.
6/12

నాగార్జున సాగర్ మొత్తం 26 గేట్లకు 22 గేట్లు ఎత్తి నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు. పర్యటకులతో సాగర్ ప్రాంత పరిసరాలు కోలాహలంగా మారాయి.
7/12

కనుచూపు మేర నీళ్లే కనిపిస్తూ జలాశయం మొత్తం నిండుకుండను తలపిస్తోంది.
8/12

శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా అన్ని గేట్లూ ఎత్తేయడంతో ప్రాజెక్టుకు పర్యటకుల తాకిడి పెరిగింది. అందులోనూ ఆదివారం కావడంతో జనం బాగా వచ్చారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
9/12

సున్నిపెంట నుంచి దోమలపెంట వరకు ఘాట్ రోడ్డులో సుమారు 5 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
10/12

ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
11/12

స్వల్ప వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. 2007 తర్వాత జూలైలో ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి.
12/12

గత వారంలో ఒక్క రోజులోనే 28 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చింది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఈసారి త్వరగా ఎత్తారు.
Published at : 02 Aug 2021 08:09 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion