తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
వేగవంతంగా జరుగుతున్న పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను సీఎం అభినందించారు.
కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసుకుంటూ తుది మెరుగులకు సిద్ధమవుతున్న సచివాలయ భవన నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించారు.
నిర్మాణంలో ఉన్న మినిస్టర్ చాంబర్లు, పార్కింగ్ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల చాంబర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తూ, అధికారులకు తగు సూచనలిచ్చారు.
కారిడార్లు సహా గ్రౌండు ఫ్లోరు, మొదటి ఫ్లోరుతో సహా నిర్మాణంలో వున్న సచివాలయ ప్రాంగణమంతా కలియతిరిగారు.
తుది దశ నిర్మాణంలో చేపట్టవలసిన ఎలివేషన్ తదితర ఫైనల్ వర్కుల కోసం కేసీఆర్ తగు సూచనలు చేశారు. సచివాలయం బాహ్య అలంకరణలో భాగంగా గోడలకు వేసే గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, తదితర మోడళ్లను అధికారులు ప్రదర్శనకు పెట్టారు.
వాటిని నాణ్యతను కలర్ డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి ఎలివేషన్ ప్రకాశవంతంగా, సుందరంగా కనిపించేలా ఉండాలని సూచించారు.
వాల్ గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్స్, యూపీవీసీ విండోస్, అల్యూమినియం ఫాబ్రికేషన్స్, మెట్లకు వేసే గ్రానైట్స్, ఫ్లోరైడ్ మార్బుల్స్, గ్రానైట్స్ పలు రకాల మోడళ్లను అధికారులు సీఎం కేసీఆర్ ఎదుట ప్రదర్శించారు.
తన వెంట వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురి అభిప్రాయాలను తెలుసుకుని వాటిలో కొన్ని మోడళ్లను ముఖ్యమంత్రి ఫైనల్ చేశారు.
మోడల్ వాటర్ ఫౌంటేన్, లాండ్ స్కేప్, విశ్రాంతి గదులు, మీటింగ్ హాళ్లను సీఎం పరిశీలించారు. స్కై లాంజ్ నిర్మాణం గురించి సీఎం కేసీఆర్ కు అధికారులు వివరించారు.
నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా నిర్మించిన కార్యాలయాలు, విశాలమైన కారిడార్లను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం నడుస్తున్న పనితీరును అదే విధంగా ముందుకు కొనసాగించాలన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
Republic Day Celebrations 2023: రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - జెండా ఎగుర వేసిన గవర్నర్
KCR Chadar To Ajmer Dargah: అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం కేసీఆర్
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేష్
Pawan Kalyan : కొండగట్టు అంజన్న సన్నిధిలో అంజనీ పుత్రుడు, వారాహికి ప్రత్యేక పూజలు
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?