అన్వేషించండి
Ind vs Aus Final 2023: దారులన్నీ అహ్మదాబాద్ వైపే - కుంభమేళాను తలపిస్తోన క్రికెట్ స్టేడియం పరిసరాలు
world cup 2023 final: భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలిస్తే చూడాలని గుజరాత్ లోని నరేంద్రమోదీ స్టేడియానికి భారీగా అభిమానులు తరలివస్తున్నారు. టీమిండియా జెర్సీలతో స్టేడియం బయట జనసునామీ కనిపిస్తోంది.

ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయిన నరేంద్రమోదీ స్టేడియం
1/22

వరల్డ్ కప్ ఫైనల్ కోసం భారీగా తరలి వస్తున్న ఫ్యాన్స్
2/22

కిక్కిరిసిపోయిన నరేంద్రమోదీ స్టేడియం
3/22

గ్రౌండ్‌కు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు
4/22

సెలబ్రెటీల రాకతో సందడి వాతావరణం
5/22

మూడోసారి విశ్వవిజేతగా నిలవాలని ఫ్యాన్స్ కోరిక
6/22

భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలిస్తే చూడాలని తరలి వచ్చిన అభిమానులు
7/22

టీమిండియా జెర్సీలతో స్టేడియం బయట జనసునామీ కనిపిస్తోంది.
8/22

ఎటు చూసినా భారత్ విజయంసాధించాలని నినాదాలతో ఫ్యాన్స్ సందడి సందడి చేస్తున్నారు.
9/22

ఇటు సెలబ్రెటీలు, సినీ రాజకీయ ప్రముఖుల రాకతో నరేంద్రమోదీ స్టేడియం కుంభమేళాను తలపిస్తోంది.
10/22

ప్రపంచకప్‌లో మహా సంగ్రామానికి టీమిండియా(Team India) సిద్ధమైంది.
11/22

సూపర్ సండే రోజున అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా(Austrelia)తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.
12/22

టీమిండియా విజయం కోసం 130 కోట్ల మంది ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
13/22

2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులైన విరాట్ కోహ్లి, అశ్విన్ మరోసారి ఆ అనుభూతిని పొందాలని పట్టుదలతో ఉన్నారు
14/22

ఏమాత్రం ఎమరుపాటు లేకుండా.. ముచ్చటగా మూడోసారి కప్పును గెలిచేందుకు రోహిత్ సేన సిద్ధంగా ఉంది.
15/22

ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో 1983లో కపిల్ దేవ్ కప్పును ఎత్తిన క్షణాలను... 2011లో ధోని సిక్సు కొట్టి గెలిపించిన అనుభూతులను మరోసారి కళ్లారా వీక్షించాలని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
16/22

స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ తుది పోరులో ఆస్ట్రేలియాను మట్టికరిపించి టీమిండియా విజయం సాధించాలని.. కోట్లమంది క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
17/22

ఒత్తేడే ప్రధాన శత్రువుగా టీమిండియా బరిలోకి దిగుతోంది. తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని ఒత్తిడి తమపై ఎప్పుడూ ఉండేదేనని రోహిత్ శర్మ ఇప్పటికే స్పష్టం చేశాడు.
18/22

అప్రతిహాతంగా పది విజయాలతో ఫైనల్ చేరిన టీమిండియా...11 వ మ్యాచ్‌లోనూ గెలిచి ఓటమే లేకుండా ప్రపంచకప్ గెలవాలని పట్టుదలగా ఉంది.
19/22

రోహిత్‌తో సహా క్రికెటర్లందరూ తమ కెరీర్‌లోనే అత్యంత కీలకమైన మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమయ్యారు.
20/22

భారత్ బ్యాటింగ్‌లో చాలా బలంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ 550 పరుగులతో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు.
21/22

90 సగటుతో విరాట్ కోహ్లి 711 పరుగులు చేసి ఈ ప్రపంచకప్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ సెమీఫైనల్లో సెంచరీ చేసి మంచి టచ్‌లో ఉన్నాడు.
22/22

రాహుల్ కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. గిల్, జడేజాలు కూడా ఫామ్‌లో ఉన్నారు. KL రాహుల్ ప్రశాంతత, రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ నైపుణ్యం టీమిండియాకు అదనపు బలంగా మారాయి.
Published at : 19 Nov 2023 01:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఇండియా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion