అన్వేషించండి
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీగా తరలి వచ్చిన భక్తులు - ఉదయం మోహినీ అవతారం ..సాయంత్రం గరుడవాహన సేవ!
Tirumala Brahmotsavam Photos: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు అక్టోబరు 08 మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు మలయప్పస్వామి..సాయంత్రం గరుడవాహన సేవ జరగనుంది

Tirumala Brahmotsavam
1/8

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వాహనసేవలలో భాగంగా అక్టోబరు 08 ఉదయం మోహిని అవతారంతో మాడవీధుల్లో విహరించారు మలయప్పస్వామి
2/8

అక్టోబరు 08 సాయంత్రం గరుడవాహన సేవ జరగనుంది. వాహనసేవల్లో అత్యంత విశిష్టమైన ఈ సేవను చూసి తరించేందుకు భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
3/8

శ్రీవారి ప్రియభక్తుడైన గరుత్మంతుడి వాహనంపై విహరించే మలయప్పస్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయంటారు.
4/8

అక్టోబరు 08 మంగళవారం సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 11 గంటలవరకూ గరుడవాహన సేవ జరగుతుంది. ఈ రోజు ఉదయాన్నే మోహిని మోహినీ అవతారంలో దర్శనమిచ్చిన మలయప్పస్వామిని భారీగా భక్తులు దర్శించుకున్నారు.
5/8

గరుడవాహన సేవ సందర్భంగా 24 గంటల పాటూ కొండపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదు. నడకమార్గంలో స్వామి సన్నిధికి చేరుకోవచ్చు.
6/8

ఉదయం మోహని అవతారాన్ని భారీగా భక్తులు దర్శించుకోగా..సాయంత్రం జరగనున్న గరుడవానన సేవకు దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా..
7/8

గరుడవాహన సేవకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మాడవీధుల్లో దాదాపు 2 లక్షల మంది ప్రత్యక్షంగా వాహనసేవ చూసేలా ఏర్పాట్లు చేశారు..
8/8

భక్తులు పార్కింగ్ స్థలాలు గుర్తించేందుకు క్యూ ఆర్ కోడ్ లు ఏర్పాటు చేశారు. తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి రూట్లలో పార్కింగ్ స్థలాలతో పాటూ తిరుమలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచారు
Published at : 08 Oct 2024 01:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion