అన్వేషించండి
Sawan 2025: శ్రావణమాసంలో ఈ మూడు రోజుల్లో శివాలయంలో వెండి జంట నాగులను సమర్పించండి!
Silver Naag Nagin: శ్రావణ మాసంలో జంటనాగులను శివుడికి సమర్పిస్తే జాతకంలో ఉండే గ్రహ దోషాలు తొలగిపోతాయని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. శ్రావణ సోమవారం, నాగపంచమి రోజుల్లో మరింత ప్రత్యేకం..
వెండి నాగు పాములు
1/6

శ్రావణ మాసంలో శివ భక్తులు శివారాధనలో మునిగిపోతారు. శివునికి ఉండే పవిత్ర చిహ్నాల్లో నాగదేవత ఒకటి.
2/6

శ్రావణ మాసంలో శివలింగంపై వెండి జంట నాగులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది దైవిక అనుగ్రహం. కష్టాల నుంచి విముక్తిని కలిగిస్తుంది. అందుకే శ్రావణ మాసంలో ప్రజలు జంట నాగులను కొనుగోలు చేసి నాగపంచమి రోజు సమర్పిస్తారు
3/6

శ్రావణ మాసంలో శివలింగంపై వెండి నాగుపాముల జతను సమర్పించడం వల్ల కూడా కాలసర్ప దోషం నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈ పరిహారంతో గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి.
4/6

శ్రావణ మాసంలో ఏ రోజైనా శివలింగంపై జంట నాగులను సమర్పించవచ్చు..అయితే శ్రావణసోమవారం, మాస శివరాత్రి, నాగపంచమి రోజుల్లో మరింత శుభప్రదం. జంట నాగులను ఆలయంలో శివలింగం దగ్గరే వదిలేయవచ్చు లేదంటే ఇంటికి తీసుకొచ్చి పూజా స్థలంలో పెట్టి పూజించవచ్చు
5/6

నీరు, పాలు, పెరుగు, నెయ్యి లేదా తేనెతో శివలింగానికి అభిషేకం చేయండి. తరువాత శివలింగం జంటపాములను ఉంచండి.
6/6

శివలింగంపై వెండి నాగులను సమర్పించినప్పుడు “ఓం నమః శివాయ” లేదా “ఓం నాగేంద్రహారాయ నమః” మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి.
Published at : 29 Jul 2025 08:30 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















