అమెరికాలో మళ్లీ బాంబులు, తూపాకీల మోత మోగింది. న్యూయార్క్ బ్రూక్లిన్ సబ్‌వే స్టేషన్ Brooklyn Subway Station) వద్ద పేలుడు, కాల్పులు జరిగాయి.
బ్రూక్లిన్ సబ్‌వే వద్ద జరిగిన కాల్పుల్లో 13 మంది వరకు గాయపడినట్లు న్యూయార్క్ అధికారులు తెలిపారు.
బ్రూక్లిన్ సబ్‌వే స్టేషన్‌లో అకస్మాత్తుగా కాల్పుల శబ్దం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శబ్దం రాగానే జనాలు భయంతో పరుగులు పెట్టారు.
అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో పలు పేలుడు పదార్థాలు కూడా లభ్యమయ్యాయి.
ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పారిపోగా.. పట్టుకునేందుకు మెట్రోస్టేషన్లు మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో గాయపడ్డ ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనేదానిపై ఇంకా స్పష్టత లేదు.
న్యూయార్క్ నగరానికి చెందిన బాంబు తనిఖీ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడు ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపట్టింది. ఎందుకు కాల్పులు జరిగాయనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
స్థానిక మీడియా ప్రకారం 36వ స్ట్రీట్ స్టేషన్ వద్ద కాల్పుల మోతతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. కాల్పులు జరిపిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గ్యాస్ మాస్క్ ధరించిన ఓ ముసుగు వ్యక్తి న్యూయార్క్ లోని బ్రూక్లిన్ సబ్ వే వద్ద ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. కొన్ని పేలుడు పదార్థాలు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
న్యూయార్క్‌లో జనవరిలో ఓ అపరిచిత వ్యక్తి మహిళను రైలు కిందకు తోసి హత్య చేశాడు. ఆ తరువాత జరిగిన పెద్ద ఘటనగా ఈ కాల్పుల ఘటనగా అధికారులు చెబుతున్నారు.
న్యూయార్క్, బ్రూక్లిన్ లోని సబ్ వే వద్ద జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
In Pics: అమెరికాలో భీకర కాల్పులు- భయంతో జనం పరుగులు
Srilanka Crisis: సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఆకలి కేకలు- సాయం ప్రకటించిన భారత్
KTR : న్యూయార్క్ నగర వీధుల్లో మంత్రి కేటీఆర్, విద్యార్థి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ !
Shree Saini: అమెరికాలో తళుకులీనుతున్న భారతీయ అందం శ్రీ షైనీ
Shane Warne: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ కన్నుమూత
Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్గా కేసీఆర్ !
Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Breaking News Live Updates: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు