అన్వేషించండి
Neethone Dance 2.0 Winner: అమర్ దీప్ కప్పు కొట్టాడ్రా... మొదలెట్టండి సంబరాలు - ఎన్ని లక్షలు వచ్చాయో తెల్సా?
Amardeep Chowdary: అమర్ దీప్ చౌదరి ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. ఆయన ఓ కప్పు కొట్టాడు. అతడు బిగ్ బాస్ విన్నర్ కాలేదని నిరాశపడిన అభిమానుల్లో 'నీతోనే డ్యాన్స్ 2.0' విజేతగా నిలిచి జోష్ నింపాడు.
![Amardeep Chowdary: అమర్ దీప్ చౌదరి ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. ఆయన ఓ కప్పు కొట్టాడు. అతడు బిగ్ బాస్ విన్నర్ కాలేదని నిరాశపడిన అభిమానుల్లో 'నీతోనే డ్యాన్స్ 2.0' విజేతగా నిలిచి జోష్ నింపాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/74bbf41d16996d7a660082faa41fd3531719197542912313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'నీతోనే డ్యాన్స్ 2.0' ట్రోఫీతో అమర్ దీప్, తేజస్విని (Image Courtesy: starmaa / Instagram)
1/7
![అమర్ దీప్ చౌదరికి బుల్లితెరపై ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతడు 'బిగ్ బాస్' ఇంటిలోకి వెళ్ళినప్పుడు అందరూ విజేతగా నిలుస్తాడని భావించారు. కానీ, స్క్రిప్ట్ వేరేలా ఉండటంతో కాలేకపోయాడు. 'బిగ్ బాస్' కప్ కొట్టలేదని ఫీల్ అయిన అభిమానుల్లో ఇప్పుడు అమర్ దీప్ చౌదరి జోష్ నింపాడు. స్టార్ మా డాన్స్ రియాలిటీ షో 'నీతోనే డ్యాన్స్ 2.0' విజేతగా నిలిచాడు. అమర్ దీప్, తేజస్విని గౌడ జంట 'నీతోనే డ్యాన్స్ 2.0' కప్ అందుకుంది. (Image Courtesy: starmaa / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/0176f2c9bf14efbdf5dcae8dbafd116a387db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమర్ దీప్ చౌదరికి బుల్లితెరపై ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతడు 'బిగ్ బాస్' ఇంటిలోకి వెళ్ళినప్పుడు అందరూ విజేతగా నిలుస్తాడని భావించారు. కానీ, స్క్రిప్ట్ వేరేలా ఉండటంతో కాలేకపోయాడు. 'బిగ్ బాస్' కప్ కొట్టలేదని ఫీల్ అయిన అభిమానుల్లో ఇప్పుడు అమర్ దీప్ చౌదరి జోష్ నింపాడు. స్టార్ మా డాన్స్ రియాలిటీ షో 'నీతోనే డ్యాన్స్ 2.0' విజేతగా నిలిచాడు. అమర్ దీప్, తేజస్విని గౌడ జంట 'నీతోనే డ్యాన్స్ 2.0' కప్ అందుకుంది. (Image Courtesy: starmaa / Instagram)
2/7
![మొత్తం 12 మంది జంటలతో 'నీతోనే డ్యాన్స్ 2.0' రియాలిటీ షో మొదలైంది. ఆ షో నుంచి ఫినాలేకు ఐదు జంటలు వచ్చాయి. ఆదివారం రాత్రి జరిగిన ఫినాలేలో అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ జంట విజేతగా నిలిచిందని జడ్జిలు అనౌన్స్ చేశారు. (Image Courtesy: starmaa / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/f04f50608be2632c3549bfb2c43abc36931ff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొత్తం 12 మంది జంటలతో 'నీతోనే డ్యాన్స్ 2.0' రియాలిటీ షో మొదలైంది. ఆ షో నుంచి ఫినాలేకు ఐదు జంటలు వచ్చాయి. ఆదివారం రాత్రి జరిగిన ఫినాలేలో అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ జంట విజేతగా నిలిచిందని జడ్జిలు అనౌన్స్ చేశారు. (Image Courtesy: starmaa / Instagram)
3/7
![ఇంతకీ, 'నీతోనే డ్యాన్స్ 2.0' విజేతగా నిలిచినందుకు అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ జంటకు ప్రైజ్ మనీ ఎంత వచ్చిందో తెలుసా? అక్షరాలా 15 లక్షల రూపాయలు. అదొక్కటే కాదు... ఇంకా బోలెడు గిఫ్ట్ హ్యాంపర్లు కూడా వచ్చాయి. (Image Courtesy: starmaa / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/a4237afbc367caa84d75603fcf5e64e2e70c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇంతకీ, 'నీతోనే డ్యాన్స్ 2.0' విజేతగా నిలిచినందుకు అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ జంటకు ప్రైజ్ మనీ ఎంత వచ్చిందో తెలుసా? అక్షరాలా 15 లక్షల రూపాయలు. అదొక్కటే కాదు... ఇంకా బోలెడు గిఫ్ట్ హ్యాంపర్లు కూడా వచ్చాయి. (Image Courtesy: starmaa / Instagram)
4/7
![అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ దంపతులకు అభిమానులతో పాటు పలువురు ప్రేక్షకులు కంగ్రాట్స్ చెబుతున్నారు. 'నీతోనే డ్యాన్స్ 2.0' కప్ కొట్టినందుకు సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ అభినందనల వెల్లువ కనబడుతోంది. (Image Courtesy: amardeep_chowdary / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/5d6152a764fd9a352db64e9a16317b56821cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ దంపతులకు అభిమానులతో పాటు పలువురు ప్రేక్షకులు కంగ్రాట్స్ చెబుతున్నారు. 'నీతోనే డ్యాన్స్ 2.0' కప్ కొట్టినందుకు సోషల్ మీడియాలో ఈ ఇద్దరికీ అభినందనల వెల్లువ కనబడుతోంది. (Image Courtesy: amardeep_chowdary / Instagram)
5/7
![ఒకవైపు సీరియళ్లు, రియాలిటీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నారు అమర్ దీప్ చౌదరి. ఇప్పుడు ఆయన హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమా ద్వారా సురేఖావాణి కుమార్తె సుప్రీతా నాయుడు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. (Image Courtesy: amardeep_chowdary / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/20a424b6ce637100c786c2a1fa032cc6ff4c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒకవైపు సీరియళ్లు, రియాలిటీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నారు అమర్ దీప్ చౌదరి. ఇప్పుడు ఆయన హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమా ద్వారా సురేఖావాణి కుమార్తె సుప్రీతా నాయుడు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. (Image Courtesy: amardeep_chowdary / Instagram)
6/7
![తేజస్విని గౌడ సైతం సీరియల్స్, రియాలిటీ షోలు, యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో ఆవిడ కూడా సినిమాలు చేసే అవకాశం ఉంది. (Image Courtesy: amardeep_chowdary / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/eb1073e4f63948c94d311c76002a89aac193c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తేజస్విని గౌడ సైతం సీరియల్స్, రియాలిటీ షోలు, యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో ఆవిడ కూడా సినిమాలు చేసే అవకాశం ఉంది. (Image Courtesy: amardeep_chowdary / Instagram)
7/7
![అమర్ దీప్ చౌదరి స్నేహితుడు, మరొక యువ నటుడు మానస్ సైతం 'నీతోనే డ్యాన్స్ 2.0' ఫినాలేకి చేరుకున్నాడు. కానీ, విజేతగా నిలవలేకపోయాడు. (Image Courtesy: amardeep_chowdary / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/7134eacbc93e0ed639df2b086a0e35fec2ae0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమర్ దీప్ చౌదరి స్నేహితుడు, మరొక యువ నటుడు మానస్ సైతం 'నీతోనే డ్యాన్స్ 2.0' ఫినాలేకి చేరుకున్నాడు. కానీ, విజేతగా నిలవలేకపోయాడు. (Image Courtesy: amardeep_chowdary / Instagram)
Published at : 24 Jun 2024 08:40 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion