అన్వేషించండి
Brahmamudi Serial Today November 28th Highlights :కావ్యకు టిప్ ఇచ్చిన రాజ్.. వీడికి మామూలు బలుపు కాదు - బ్రహ్మముడి నవంబరు 28 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: కావ్య విషయంలో తగ్గేదేలే అంటాడు రాజ్... ఎందుకు తగ్గవో చూస్తానంటుంది తల్లి అపర్ణ...ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today November 28th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/9

వంట చేస్తూ చేయి కాల్చుకుంటుంది ఇందిరాదేవి. ఇంట్లో ఇంతమంది ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరా స్వప్న కడుపుతో ఉన్నా సహాయం చేస్తోంది మీకు ఆ బుద్ధి లేదా అని ధాన్యలక్ష్మి, రుద్రాణిపై ఫైర్ అవుతాడు
2/9

అస్సలు నాకు అలవాటే లేదని రుద్రాణి అంటే.. నీకు ఇప్పుడు మానవత్వం గుర్తొచ్చిందా? ఒకప్పుడు ఈ పనులన్ని నేను చేసేదాన్ని అప్పడు ఎవ్వరూ గుర్తించలేదు..అందరి మధ్యా ఒంటరిగా బతుకుతున్నా అని రివర్సవుతుంది. నీకు వస్తేనే కష్టమా అని నిలదీస్తుంది..
3/9

ఆవేశంగా కావ్యకు కాల్ చేసిన రాజ్.. తిన్నావా అని కుశల ప్రశ్నలు వేసి ఆ తర్వాత నీవల్లే ఈ ఇల్లు ఇలా తయారైందంటూ నిందలు వేస్తాడు. ఫోన్ లాక్కున్న అపర్ణ.. కావ్య వల్ల కాదు నీ వల్లే ఇదంతా జరిగిందని రివర్సవుతుంది. మన పంతాలు పట్టింపులు పెద్దవాళ్లపై చూపించాలా అని రాజ్ అంటే ఆ మాట నేను అనాలని క్లాస్ వేస్తుంది.
4/9

నీకు బుద్ధి ఉంటే వచ్చి నీ పెళ్లాన్ని తీసుకెళ్లు అప్పటివరకూ కాల్ చేయకు అంటుంది. కాల్ కట్ చేసిన తర్వాత వాడి మాటలకు నువ్వు కరిగిపోకు అంటుంది అపర్ణ. కావ్య మాత్రం అమ్మమ్మ,తాతయ్య పరిస్థితి తలుచుకుని బాధపడుతుంది
5/9

అనామిక ఇంటికి కళ్యాణ్ ని తీసుకెళ్లిన అప్పు... రైటర్ గా కళ్యాణ్ కి వచ్చిన చెక్ చూపిస్తుంది.ంనీలా అడ్డదారుల్లో నక్క తెలివితేటలతో వచ్చిన డబ్బు కాదిది..నా శ్రీవారు తన టాలెంట్ తో సంపాదించిన డబ్బు ఇది. నువ్వు పది జన్మలు ఎత్తినా కవిలా రాయలేవు అని క్లాస్ ఇస్తుంది. నిజంగా ఈ కళ్యాణ్ గాడికి అంత సీన్ ఉందా అనుకుంటుంది అనామిక
6/9

అమ్మమ్మ, తాతయ్యకి తీసుకెళ్లేందుకు క్యారియర్ సర్దుతుంది కావ్య.. అపర్ణ ఇవేమీ వద్దు ఆగు అంటుంది. కానీ మీ అబ్బాయి మారుతారు అనుకోవడం లేదు, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు..నేను మాత్రం వాళ్లకి భోజనం తీసుకెళ్తాను అంటుంది
7/9

దీన్ని ఎక్కడ కన్నావ్ కనకం..మునులు, సన్యాసులు ఉండే ఆశ్రమంలోనా నన్ను వెర్రిదాన్ని చేస్తోంది అంటోంది అపర్ణ. నిజమే వదినా అంటుంది కనకం... తల్లికి ఉరిశిక్ష పడుతుందని తెలిసినా సాక్ష్యం చెప్పే తీరేరకం అది అంటుంది.
8/9

క్యారియర్ తో వచ్చిన కావ్యను చూసి షాక్ అయిన రాజ్ క్లాస్ వేస్తాడు. నీకు ఏం సంబంధం అనగానే.. కావ్య నా మనవరాలు ఈ ఇంటి కోడలు అని క్లారిటీ ఇస్తాడు సీతారామయ్య. నాకు వద్దనుకున్నా మీకేంటని క్వశ్చన్ చేస్తాడు.. ఎవరు ఏమన్నా కావ్య ఈ ఇంటి కోడలు.. ఎవరు అన్న మాటలు పట్టించుకోవద్దని సీతారామయ్య ఇందిరాదేవి చెబుతారు
9/9

బ్రహ్మముడి నవంబరు 29 ఎపిసోడ్ లో... పనిమనిషిగా తాతయ్య దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా ఇక్కడి నుంచి పో అంటాడు. డిన్నర్ రెడీ చేసి పెట్టానని చెప్పి కావ్య వెళుతుంటే.. నీ భోజనం ఇల్లంతా నచ్చింది ఈ టిప్ తీసుకో అని డబ్బులిచ్చి అవమానిస్తాడు రాజ్. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది
Published at : 28 Nov 2024 09:45 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
న్యూస్
హైదరాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion