అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Party For Pushpa Team: బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో 'పుష్ప' టీం కోసం స్పెషల్ పార్టీ - 'పుష్పరాజ్' సందడి చూశారా?
Allu Arjun: బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో పుష్ప స్క్రీనింగ్ నేపథ్యంలో పుష్ప మూవీ టీంకు కోసం స్పెషల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో బన్నీ ఫుల్ సందడి చేశారు. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి
![Allu Arjun: బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో పుష్ప స్క్రీనింగ్ నేపథ్యంలో పుష్ప మూవీ టీంకు కోసం స్పెషల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో బన్నీ ఫుల్ సందడి చేశారు. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/4bde821ebf4a0e5835708283d9f5b6ee1708192674940929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Team: mythriofficial/Instagram
1/9
![Pushpa Team At Berlin Film Festival: ప్రస్తుతం 'పుష్ప: ది రైజ్' మేనియా ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్లింది. ఇప్పుడీ సినిమా ప్రతిష్ఠాత్మక బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు కూడా వెళ్లింది. ఐకాన్ స్టార్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది ఈ మూవీ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/b5752018976042389306d196082636df69cc0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Pushpa Team At Berlin Film Festival: ప్రస్తుతం 'పుష్ప: ది రైజ్' మేనియా ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్లింది. ఇప్పుడీ సినిమా ప్రతిష్ఠాత్మక బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు కూడా వెళ్లింది. ఐకాన్ స్టార్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది ఈ మూవీ.
2/9
![దీంతో ఆయనకు ప్రస్తుతం జరుగుతున్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ప్రత్యేక ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఆయన ఇండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా పుష్ప: ది రైజ్‌ను ఇదే వేదికపై ప్రదర్శించబోతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/05b661134271519dbb9d1f5a097b9258673cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీంతో ఆయనకు ప్రస్తుతం జరుగుతున్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ప్రత్యేక ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఆయన ఇండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా పుష్ప: ది రైజ్‌ను ఇదే వేదికపై ప్రదర్శించబోతున్నారు.
3/9
![ఈ నేపథ్యంలో పుష్ప టీం కోసం ప్రత్యేకంగా అక్కడ గ్రాండ్‌ని పార్టీని నిర్వహించారు. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం అక్కడ అల్లు అర్జున్‌తో పాటు మూవీ నిర్మాతలు ఇతర మూవీ టీం సభ్యులు పార్టీలో సందడి చేశారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ మీడియా, పిలిం సర్కిల్స్‌తో అల్లు అర్జున్ ఇతర పుష్ప టీం సభ్యులు ఈ పార్టీలో సందడి చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/b52b227ae99668ad0e7c7ed174f710b56f184.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ నేపథ్యంలో పుష్ప టీం కోసం ప్రత్యేకంగా అక్కడ గ్రాండ్‌ని పార్టీని నిర్వహించారు. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం అక్కడ అల్లు అర్జున్‌తో పాటు మూవీ నిర్మాతలు ఇతర మూవీ టీం సభ్యులు పార్టీలో సందడి చేశారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ మీడియా, పిలిం సర్కిల్స్‌తో అల్లు అర్జున్ ఇతర పుష్ప టీం సభ్యులు ఈ పార్టీలో సందడి చేశారు.
4/9
![ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా పుష్ప మూవీ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప: ది రైజ్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో బన్నీ నేషనల్ స్టార్ అయిపోయాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/9f3790786158a967abbe7117ea974330633e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా పుష్ప మూవీ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప: ది రైజ్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో బన్నీ నేషనల్ స్టార్ అయిపోయాడు.
5/9
![అంతేకాదు ఈ మూవీకి గానూ రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డును కూడా అందుకుని రికార్డు సృష్టించాడు. ఇప్పుడు బెర్లిన్ ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్ ఆహ్వానం అందుకుని మరో అరుదైన గౌరవం పొందారు. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న అల్లు అర్జున్ అక్కడ ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌తో ముచ్చటించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/588bbd90c22c39bcef61db5ba055fcd7abf2d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అంతేకాదు ఈ మూవీకి గానూ రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డును కూడా అందుకుని రికార్డు సృష్టించాడు. ఇప్పుడు బెర్లిన్ ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్ ఆహ్వానం అందుకుని మరో అరుదైన గౌరవం పొందారు. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న అల్లు అర్జున్ అక్కడ ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌తో ముచ్చటించారు.
6/9
![ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకలో ‘పుష్ప’ సినిమాను పదర్శించనున్నట్లు తెలిపారు. విదేశీ ప్రేక్షకులు ‘పుష్ప’ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఉందన్నారు. భారతీయ సినిమాను వాళ్లు ఏ కోణంలో చూస్తారో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఫిలిం ఫెస్టివల్ కు వచ్చినట్లు వివరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/f48b6bd5ab0fdc22c173b5253ab40aec5a7a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకలో ‘పుష్ప’ సినిమాను పదర్శించనున్నట్లు తెలిపారు. విదేశీ ప్రేక్షకులు ‘పుష్ప’ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఉందన్నారు. భారతీయ సినిమాను వాళ్లు ఏ కోణంలో చూస్తారో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఫిలిం ఫెస్టివల్ కు వచ్చినట్లు వివరించారు.
7/9
![ఈ సందర్భంగా ఓ హాలీవుడ్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘పుష్ప’ సినిమాతో పోల్చితే ‘పుష్ప 2’లో తన షేడ్స్ చాలా భిన్నంగా ఉంటాయని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/8d7b29f6fde2b951779e46b0486d565839402.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సందర్భంగా ఓ హాలీవుడ్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘పుష్ప’ సినిమాతో పోల్చితే ‘పుష్ప 2’లో తన షేడ్స్ చాలా భిన్నంగా ఉంటాయని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలిపారు.
8/9
![పుష్పరాజ్ స్కేల్, క్యారెక్టరైజేషన్, కాన్వాస్, ప్రెజెంటేషన్ పెద్ద రేంజిలో ఉంటుందన్నారు. ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ ప్రాంతీయ స్థాయిలో తన కార్యకలాపాలు కొనసాగిస్తే, పార్ట్ 2 లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ఉండబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ గొడవ తీవ్రస్థాయికి వెళ్లనున్నట్లు చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/cf47dc73665e6e9754f3ef5cadf055199ff53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పుష్పరాజ్ స్కేల్, క్యారెక్టరైజేషన్, కాన్వాస్, ప్రెజెంటేషన్ పెద్ద రేంజిలో ఉంటుందన్నారు. ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ ప్రాంతీయ స్థాయిలో తన కార్యకలాపాలు కొనసాగిస్తే, పార్ట్ 2 లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ఉండబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ గొడవ తీవ్రస్థాయికి వెళ్లనున్నట్లు చెప్పారు.
9/9
![బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో పుష్ప మూవీ స్క్రీనింగ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/03fc020e8b9ecc1751d1bbc7bdfb5c7e5c2f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో పుష్ప మూవీ స్క్రీనింగ్
Published at : 17 Feb 2024 11:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement