పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించారు. లండన్ పర్యటనలో ఉన్న జూపల్లి ఓ బస్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియోని షేర్ చేశారు. ఇక్కడ అరెస్ట్‌లతో అక్రమాలు చేస్తూ..అక్కడ ఆనందిస్తున్నారంటూ మండి పడ్డారు. పట్నంని పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్ని మరింత వేడెక్కించింది. నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి వికారాబాద్ డీటీసీ సెంటర్‌లో ఉంచినట్టు సమాచారం. అయితే...ఈ అరెస్ట్‌పై వెంటనే స్పందించిన పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో పాటు మరి కొందరు బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. నరేందర్ రెడ్డిని కలిసిన తరవాత మీడియాతో మాట్లాడారు మహేశ్ రెడ్డి. కలెక్టరే దాడి జరగలేదని చెప్పిన తరవాత..ఎందుకీ అక్రమ అరెస్ట్‌లు అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారని, అదొక్కటే కారణం చూపించి అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. అక్రమ కేసులను తీవ్రం ఖండిస్తున్నామని, కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. అయితే..ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి వచ్చారు. ఈ వివాదం ముదురుతున్న సమయంలో ఆయన అక్కడికి రావడంపై ఉత్కంఠ నెలకొంది.