అన్వేషించండి

Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు

Sangareddy News: సంగారెడ్డి జిల్లాలో డబుల్ మర్డర్ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే పాత కక్షలతో తల్లీకొడుకులను కత్తితో పొడిచి చంపేశాడు.

Mother And Son Brutal Murder In Sangareddy: సంగారెడ్డి జిల్లాలో (Sangareddy District) గురువారం దారుణం జరిగింది. ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని వీరభద్రకాలనీలో ఈ ఘటన జరిగింది. బిహార్ రాష్ట్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తల్లీకొడుకలను కత్తితో పొడిచి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు యూపీకి చెందిన సరోజాదేవి (50), అనిల్ (30)గా గుర్తించారు. కాగా, పాత గొడవలే హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ జరిగింది..

తన రెండేళ్ల కొడుకు చావుకు వీరు కారణమని అందుకే వారిని చంపినట్లు నిందితుడు నాగరాజు చెబుతున్నట్లు తెలుస్తోంది. తన భార్యపై కూడా మృతులిద్దరూ దాడి చేసేందుకు ఇంట్లోకి వచ్చినట్లు ఆరోపించాడు. కొడుకు చనిపోయిన రెండేళ్ల తర్వాత కక్ష పెంచుకుని ఈ రోజు కత్తితో దాడి చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే కారణమా.?, వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా.? అని విచారిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నడిరోడ్డుపై డబుల్ మర్డర్ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

మరోవైపు, ఇదే సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. నారాయణ్‌ఖేడ్‌లోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని.. వసతి గృహం పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన హాస్టల్ సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

ప్రియుడితో కలిసి భర్త మర్డర్

అటు, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని మహాత్మగాంధీ కాలనీ తండాలో పొలం వద్ద రాజునాయక్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అతని భార్య ప్రియునితో కలిసి భర్తను చంపించినట్లు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాత్మాగాంధీ కాలనీ తండాకు చెందిన రాజునాయక్ అదే తండాకు చెందిన హిమబిందును తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బాబు, పాప సంతానం. ఇలా సాగుతున్న క్రమంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కళ్లెంచెరువు తండాకు చెందిన చంటి.. మహాత్మాగాంధీ కాలనీ తండాలో తన మేనమామ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే హిమబిందుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఏడాదిగా వీరి తతంగం నడుస్తుండగా.. ఈ విషయం భర్త రాజునాయక్‌కు తెలిసి ఇద్దరినీ తీవ్రంగా మందలించాడు.

దీంతో తన భర్తను అడ్డు తొలగించుకోవాలని హిమబింధు భావించింది. ఈ నెల 7న రాజునాయక్ వేరుశనగ తోటలో ఉండగా.. ప్రియుడి చంటి, అతని స్నేహితుడు రాకేశ్, హిమబిందు కలిసి అతనిపై సుత్తితో దాడి చేసి చంపేశారు. మృతదేహాన్ని కొద్దిదూరంలో పడేశారు. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Embed widget