Hyderabad Crime News: ఎగ్జామ్ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Inter Student Suicide: ఫ్యామీలో గొడవలతో బతుకుపై ఆశలు వదులుకున్న ఓ విద్యార్థి తనువు చాలించాడు. కాలేజీలో పరీక్షలు రాయడానికి ఇచ్చిన ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్ రాసి కన్నీళ్లు పెట్టిస్తున్నాడు.
Telangana Crime News: కుటుంబ తగాదాలు ఆ బాలుడిపై తీవ్ర ప్రభావం చూపాయి. మన అనుకున్న బంధువులే బలి కోరుతున్నారని, ఫ్యామిలీ చిచ్చు పెడుతున్నరని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఆ కుర్రాడు తన పరీక్షల ఆన్సర్ షీట్‌పై రాసిన సూసైడ్ నోట్ కంట తడి పెట్టిస్తుంది. తల్లిదండ్రులు, చెల్లెళ్లపై ప్రేమ ఉన్నప్పటికీ ఇలా చనిపోతున్నందుకు బాధగా ఉందంటూ రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌కు సమీపంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఇంటర్ మొదటి సంత్సరం చదువుతున్న జెశ్వాంత్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన జశ్వంత్ గౌడ్ హాస్టల్‌లోనే ఉరివేసుకున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు యాజమాన్యం తెలిపింది.
ఆలస్యంగా విద్యార్థి ఆత్మహత్యను తెలుసుకున్న హాస్టల్ నిర్వాహకులు నిజాంపేట్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు తేల్చారు. విచారణ చేపట్టిన పోలీసులు బాలుడు రాసిన లేఖను విడుదల చేశారు. అందులో కంటెంట్ చూస్తే కన్నీళ్లు ఆగవు.
"అమ్మానాన్నా నేను చేసింది తప్పే కానీ తప్పలేదు. నాన్న అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకో. ఇక నాకు బతకాలని లేదు. నాతో కావట్లేదు నాన్న. ఎలాగో నాతోనే స్టార్ట్ అయింది. మనకు అన్ని కష్టాలు, సో నానతోనే ఈ ప్రోబ్లమ్స్ ఎండ్ కావాలని ఈ పని చేస్తున్నాను. నాన్న అమ్మ నువ్వు జాగ్రత్త. చెల్లిని బాగా చూసుకో. నాకు లైఫ్‌పైన హోప్ లేదు. అమ్మా నేను సక్సెస్ కాను ఎందులో కూడా. అందుకే నేను ఇలా చేసుకుంటున్నాను అమ్మా. నాన్నా నువ్వు అమ్మను చెల్లిని హనీని బాగా చూసుకో. నాన్న నేను ఇగ భైరవ స్వామి దగ్గరకు వెళ్తున్నాను. కానీ నా ఆత్మ శాంతించాలంటే నువ్వు అమ్మకి, చెల్లికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. నాన్న నేను ఇప్పుడూ మాత్రమే ఉంటాను. ఇక చాలు నాన్న మన కష్టాలు ఎలాగూ మన ఫ్యామిలీ అంత మన చావు కోరుకుంటున్నారుగా సో నేను డిసైడ్ అయ్యాను చనిపోదామని."
ఫ్యామిలీలో గొడవలకు కారణాలు గురించి చెప్పకనే చెప్పిన జెశ్వంత్.. తన చావుకు ఎవరెవరు కారమో కూడా వివరించాడు. "నా చావుకు కారణమైన వాళ్ల పేర్లు. పరకాలలో ఉండే పెంటవ్వ, ఆమె మొదటి కుమార్తె భారతి, వాళ్ల భర్త వెంకట్ గౌడ్, వీళ్లిద్దరి మూడో బిడ్డ భాగ్య. ఆమె భర్త ఎల్లా గౌడ్, వాళ్ల మొదటి కుమార్తె రేణుక. తన చావుకు కారణమని రాసి పెట్టాడు.
చివరిగా తనకు తన ఫ్యామిలీకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. "నాకు నా ఫ్యామిలీకి న్యాయం చేయండి, నాన్న అమ్మా నాకు బతకాలని చాలా ఉంది. కానీ మన కష్టాలు పోవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే ఇలా చేశాను. సారీ అమ్మా నాన్న, మీరు మాత్రం జాగ్రత్త. ఐ లవ్‌యూ అమ్మా నాన్న, మీరు ఎప్పటికీ కలిసి ఉండాలి." అని రాసుకొచ్చాడు.
Also Read: సైబర్ నేరాల్లో హడలెత్తిస్తున్న డిజిటల్ అరెస్టులు, ఈ స్కామ్ నుంచి ఎలా తప్పించుకోవాలి?