అన్వేషించండి

Unstoppable With NBK S4: 'అన్ స్టాపబుల్ 4'లో పవన్ గురించి బాలయ్య పవర్ ఫుల్ క్వశ్చన్ - అల్లు అర్జున్ ఐకానిక్ ఆన్సర్

Unstoppable With NBK: 'అన్ స్టాపబుల్-4'లో రాబోతున్న 4 వ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పవన్ గురించి బాలయ్య అల్లు అర్జున్ ని ప్రశ్నించారు.

Unstoppable With NBK Allu Arjun Episode: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో నటసింహం నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' అనే సెలబ్రిటీ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు సీజన్లను బాలయ్య సక్సెస్ ఫుల్ గా నడిపించారు. ఇప్పుడు నాలుగవ సీజన్ నడుస్తుండగా ఇందులో నాలుగో ఎపిసోడ్లో అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరవుతున్నారు అనే విషయాన్ని ఇప్పటికే వెల్లడించారు. అలాగే దీనికి సంబంధించి వరుస ఎపిసోడ్ లను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో ప్రోమోను వదలగా, అందులో బాలయ్య పవన్ కళ్యాణ్ ప్రస్తావనను తీసుకొచ్చారు. మరి ఆ టైమ్ లో అల్లు అర్జున్ ఎలా స్పందించాడో తెలుసుకుందాం పదండి. 

మునుపెన్నడూ చూడని విధంగా బాలయ్య తన హోస్టింగ్ స్కిల్స్ 'అన్ స్టాపబుల్'తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, తనదైన స్టైల్ లో సినీ తారల పర్సనల్ విషయాలను బయట పెడుతున్నారు. ఇప్పటికే ఈ సీజన్లో మూడు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కాగా, నాలుగవ ఎపిసోడ్లో అల్లు అర్జున్ రాబోతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి ప్రోమోలు రిలీజ్ చేస్తూ ఊరిస్తున్నారు ఆహా టీం. తాజాగా మరోసారి ఒక కొత్త ప్రోమో రిలీజ్ చేసి అందులో అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నారు అనే విషయాన్ని వెల్లడించారు. తాజా ప్రోమోలో బాలకృష్ణ.. పవన్ కళ్యాణ్ ఫోటోను చూపించి అల్లు అర్జున్ ని ఓ ప్రశ్న అడుగుతున్నట్టుగా కనిపించింది.

దీనికి సంబంధించి ఆహా స్పెషల్ గా ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ ఫోటోని చూశాక అల్లు అర్జున్ ఏం చెప్పాడా ? అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నిజానికి గత కొంతకాలంగా అల్లు, మెగా ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయి అనే రూమర్ చక్కర్లు కొడుతోంది. గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ పార్టీ నాయకుడికి సపోర్ట్ చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా 'మట్కా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'ఎంత ఎత్తుకు ఎదిగాము అన్నది కాదు ఎలా పైకి వచ్చాము అన్నది ముఖ్యం' అంటూ కామెంట్స్ చేశారు. ఆయన ఇండైరెక్ట్ కామెంట్స్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే అని అనుకున్నారు చాలామంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య.. అల్లు అర్జున్ - మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న గొడవల గురించి 'అన్ స్టాపబుల్-4'లో ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టిస్తారని అంతా భావించారు. 

Also Read: మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?

అయితే పవన్ కళ్యాణ్ ఫోటోను చూశాక అల్లు అర్జున్ ఏం చెప్పాడు అన్న విషయాన్ని సస్పెన్స్ లో పెట్టారు. కానీ అంతలోనే ఆ ప్రోమోలో ఉన్న విషయం బయటకు వచ్చింది. అల్లు అర్జున్, పవన్ గురించి ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నట్టుగా కనిపించింది. కానీ చివర్లో మాత్రం 'తన దారిలో తను వెళ్ళిపోతాడు' అంటూ డైలాగ్ ని ఫినిష్ చేశాడు బాలయ్య. ఇక అల్లు అర్జున్ కూడా 'అంతే అంతే' అంటూ చెప్పుకొచ్చాడు. మరి పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చేసరికి అల్లు అర్జున్ అంత సీరియస్ గా ఏం చెప్పాడు ? అన్నది తెలీదు. కానీ చివరికి పాజిటివ్ గానే ఆ సీన్ ను క్లోజ్ చేశారు. దీంతో 'అన్ స్టాపబుల్ 4' ఎపిసోడ్ 4 లో అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ పై ఉత్కంఠ పెరిగిపోయింది. అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటో తెలియాలంటే నవంబర్ 15న స్ట్రీమింగ్ కాబోతున్న ఈ ఎపిసోడ్ ను చూడాల్సిందే. ఇక ఈ ప్రోమోలో బాలయ్య 'పుల్లా రావు' అంటూ ప్రభాస్ ఫోటోను చూపించగా... అల్లు అర్జున్ స్పందిస్తూ 'ప్రభాస్ ని ఎప్పుడు చూసినా.. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకే మాట.. ఆరడుగుల బంగారం" అని చెప్పాడు.

Also Read: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Embed widget