అన్వేషించండి
Hari Hara Veera Mallu: కీరవాణిని సత్కరించిన పవన్ కళ్యాణ్ - హరి హర వీరమల్లు టీమ్ ఫొటోస్ వైరల్!
Hari Hara Veera Mallu Photos: హరి హర వీరమల్లు సినిమాకు సంగీతం అందించిన కీరవాణిని సత్కరించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Hari Hara Veera Mallu
1/5

మనలోని పౌరుషం… వీరత్వం ఎప్పటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- ‘సలసల మరిగే నీలోని రక్తమే...’ అనే పాటకు సంగీత, సాహిత్యాలతో కీరవాణి ప్రాణం పోశారని అన్నారు పవన్ కళ్యాణ్.
2/5

ఈ సినిమా కోసం కీరవాణిగారు ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను. ఆస్కార్ గ్రహీత కీరవాణి గారిని కలిసి సాగించిన సంభాషణ ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు పవన్ కళ్యాణ్.
3/5

కీరవాణి గారి దగ్గర ఉన్న వయొలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను వయొలిన్ నేర్చుకోవడం, జంట స్వరాల వరకూ నేర్చుకుని వదిలేయడం గుర్తు చేసుకున్నాన్నారు పవన్. తనకు అమితంగా నచ్చిన 32 కథలను ఒక సంకలనంలా చేసుకుని వాటిని తనకు బహూకరించడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు
4/5

తెరపై కనిపించేది రెండున్నర గంటల సినిమాయే... కానీ కీరవాణి రోజుల తరబడి, నెలల తరబడి ఆ సినిమా కోసం తపనపడతారు..సృజనాత్మక స్వరాలతో మైమరపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకువెళ్లారని తన అభిమానం చాటుకున్నారు పవన్ కళ్యాణ్.
5/5

మే 21 ఉదయం 11.55కి అసురుల హననం అనే పాట రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 న థియేటర్లలో సందడి చేయనుంది...ఈ మేరకు గా ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచారు మేకర్స్
Published at : 20 May 2025 12:35 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆట
ఆధ్యాత్మికం
శుభసమయం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















