అన్వేషించండి
Mookuthi Amman 2 Pooja Ceremony: మూకుత్తి అమ్మన్ 2... అదేనండీ 'అమ్మోరు తల్లి 2' పూజలో నయనతార - ఫోటోలు చూడండి
Nayanthara at Mookuthi Amman 2 Launch: 'మూకుత్తి అమ్మన్ 2' చెన్నైలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి నయనతార, రెజీనా హాజరు అయ్యారు. ఆ ఫోటోలు చూడండి.
'మూకుత్తి అమ్మన్ 2' ప్రారంభోత్సవంలో నయనతార, రెజీనా, ఖుష్భూ, మీనా తదితరులు (Image Courtesy: velsfilmintl / Instagram)
1/6

నయనతారకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. తన సినిమా ప్రారంభోత్సవాలకు గానీ, పబ్లిసిటీ కార్యక్రమాలకు గానీ హాజరు కారు. కానీ, సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న 'మూకుత్తి అమ్మన్ 2' కోసం ఆ అలవాటు పక్కన పెట్టి హాజరు అయ్యారు. (Image Courtesy: velsfilmintl / Instagram)
2/6

సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న 'మూకుత్తి అమ్మన్ 2' సినిమాను వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్, ఐవివై ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అవని సినిమాక్స్, రౌడీ పిక్చర్స్ కో ప్రొడ్యూస్ చేస్తున్నాయి. చెన్నైలో గురువారం (మార్చి 6న) పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. (Image Courtesy: velsfilmintl / Instagram)
3/6

'మూకుత్తి అమ్మన్ 2' సినిమాలో నయనతార మెయిన్ లీడ్ రోల్ కాగా... దునియా విజయ్, రెజీనా, యోగిబాబు, ఊర్వశి, అభినయ, రామచంద్రరాజు, అజయ్ ఘోష్, సింగం పులి తదితరులు ఇతర పాత్రల్లో సందడి చేయనున్నారు. (Image Courtesy: velsfilmintl / Instagram)
4/6

'మూకుత్తి అమ్మన్' భారీ విజయం సాధించింది. తెలుగులో ఆ సినిమా 'అమ్మోరు తల్లి'గా డబ్బింగ్ చేయగా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడీ సినిమా కూడా తెలుగులో విడుదల చేయనున్నారు. (Image Courtesy: velsfilmintl / Instagram)
5/6

'మూకుత్తి అమ్మన్ 2' సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతం అందించనున్నారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు. (Image Courtesy: velsfilmintl / Instagram)
6/6

'మూకుత్తి అమ్మన్ 2' పూజకు తెలుగు నిర్మాతలు సునీల్ నారంగ్, సికల్యాణ్ తదితరులు కూడా అటెండ్ అయ్యారు. (Image Courtesy: velsfilmintl / Instagram)
Published at : 06 Mar 2025 04:06 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
ఆట
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















