అన్వేషించండి
Aditi Rao Hydari Siddharth Wedding: పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
Aditi Rao Hydari Wedding Photos: లవ్ బర్డ్స్ అదితి రావు హైదరి, సిద్ధార్థ్ వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. తామిద్దరం పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాళ్ల పెళ్లి ఫోటోలు చూడండి.

సిద్ధార్థ్, అదితి రావు హైదరి పెళ్లి ఫోటోలు
1/7

Siddharth Marriage Photos: 'నువ్వే నా సూర్యుడివి, నువ్వే నా చంద్రుడివి, నువ్వే నా నక్షత్రాలు' అంటూ సిద్ధార్థ్ గురించి ఇంగ్లీష్ పోయెట్రీ రాశారు అదితి రావు హైదరి. ఈ ఫోటో చూస్తే అసలు విషయం అర్థం అయ్యింది కదూ! అవును... వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
2/7

మిసెస్ అదితి రావు హైదరి అండ్ మిస్టర్ సిద్ధార్థ్ అంటూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిందీ జంట! తామిద్దరం పెళ్లి చేసుకున్నామని ఈ రోజు (సోమవారం, సెప్టెంబర్ 16న) ప్రకటించింది.
3/7

తెలంగాణలోని వనపర్తి సంస్థానానికి చెందిన వారసురాలు అదితి రావు హైదరి. ఆ వంశానికి చెందిన ఆలయంలో సిద్ధార్థ్ తో ఆవిడ ఏడు అడుగులు వేశారు. పెళ్లి తర్వాత గుడి ప్రాంగణంలో ఇలా ఫోటోలు దిగారు.
4/7

పెళ్లిలో సిద్దార్థ్, అదితి రావు హైదరి నవ్వులు. ఈ ఏడాది మార్చి నెలాఖరున వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే... తాము పెళ్లి చేసుకోలేదని, నిశ్చితార్థం మాత్రమే జరిగిందని క్లారిటీ ఇచ్చారు.
5/7

సెప్టెంబర్ 16న సిద్దార్థ్, అదితి రావు హైదరి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, కొంత మంది స్నేహితులు మాత్రమే హాజరైనట్టు తెలిసింది.
6/7

నూతన దంపతులు సిద్ధార్థ్, అదితి రావు హైదరికి పలువురు చిత్రసీమ ప్రముఖులు, ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
7/7

'మహాసముద్రం' సినిమా చిత్రీకరణలో సిద్దార్థ్, అదితి రావు హైదరి మధ్య పరిచయం జరిగింది. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి అయ్యారు.
Published at : 16 Sep 2024 12:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion