అన్వేషించండి
Aha Telugu Indian Idol 3 Winner: ఆహా... ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌కు ఎన్ని లక్షలో తెలుసా? ఫస్ట్ - సెకండ్ రన్నరప్‌లు ఎవరో తెలుసుకోండి
Telugu Indian Idol 3 Winner Prize Money: ఆహా ఓటీటీలో సింగింగ్ రియాలిటీ షో తెలుగు ఇండియన్ ఐడల్ 3 ఆదివారం (సెప్టెంబర్ 21)తో ముగిసింది. మరి ఈ షో విన్నర్, రన్నరప్ ఎంత ప్రైజ్ మనీ అందుకున్నారో తెలుసా?

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 గ్రాండ్ ఫినాలేలో ఫోటోలు
1/6

సంగీతం మీద మక్కువ, ప్రతిభ ఉంటే సరిపోదు. తమ టాలెంట్ చూపించుకోవడానికి సరైన వేదిక కూడా చాలా ముఖ్యం. తెలుగు యువతీ యువకులకు అటువంటి వేదిక కల్పించింది ఆహా ఓటీటీ. 'తెలుగు ఇండియన్ ఐడల్' పేరుతో సింగింగ్ రియాలిటీ షో చేస్తున్న సంగతి తెలిసింది. సెప్టెంబర్ 21... ఆదివారంతో ఆహా 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' ముగిసింది. మరి ఈ షోలో విజేత ఎవరో తెలుసా?
2/6

ఏపీ రాష్ట్రానికి చెందిన ఒక సాధారణ మెకానిక్ కుమారుడు, సీఏ విద్యార్థి నసీరుద్దీన్ షైక్ 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' విజేతగా నిలిచాడు. అంతే కాదు... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా మాఫియా నేపథ్యంలో సుజిత్ రూపొందిస్తున్న యాక్షన్ ఫిల్మ్ 'ఓజీ' సినిమాలో సాంగ్ పాడే అవకాశం తమన్ చేతుల మీదుగా అందుకున్నాడు.
3/6

ఆహా 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' విజేత నసీరుద్దీన్ షైక్ అందుకున్న ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? అక్షరాల 10 లక్షల రూపాయలు. ఆ మనీ కంటే విలువైన అవకాశం కూడా అతని సొంతం అయ్యింది.
4/6

నసీరుద్దీన్ షైక్ విజేతగా నిలిచిన ఆహా 'తెలుగు ఇండియన్ ఐడల్ 3'లో ఫస్ట్ రన్నరప్ (రెండో స్థానంలో) అనిరుద్ సుస్వరం నిలిచాడు. అతనికి మూడు లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందింది.
5/6

మూడో స్థానంలో యువ గాయని జీవి శ్రీ కీర్తి నిలిచింది. 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' వీక్షకులలో ఆమె స్వరానికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. మూడో స్థానం కంటే ప్రజల మనసుల్లో విలువైన స్థానాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. షో నిర్వాహకులు కీర్తి కి రెండు లక్షల రూపాయలను ప్రైజ్ మనీ కింద అందించారు.
6/6

విజేతగా నిలిచిన నసీరుద్దీన్ షైక్ కి ట్రోఫీ అందజేస్తున్న సంగీత దర్శకుడు తమన్. ఈ ఫోటోలో ఈ షో కి న్యాయ నిర్ణేతల కింద వ్యవహరించిన గాయకులు కార్తీక్ గీత మాధురిని మీరు చూడవచ్చు.
Published at : 21 Sep 2024 11:26 PM (IST)
Tags :
Telugu Indian Idol Season 3 Finale Telugu Indian Idol Season 3 Aha Telugu Indian Idol 3 Telugu Indian Idol Season 3 Winner Name Telugu Indian Idol Season 3 Winner 2024 Nazeeruddin Shaik Aha Indian Idol 3 Winner Nazeeruddin Shaik Telugu Indian Idol 3 First Runner Up Telugu Indian Idol 3 Second Runner Up Telugu Indian Idol 3 Winner Prize Money Aha Telugu Indian Idol 3 Winner Prize Money Telugu Indian Idol 3 Runner Up Prize Money Telugu Indian Idol Season 3 Top 3మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion