విజయ్ను హీరోగా, శీతల్ బట్‌ను హీరోయిన్గా పరిచయం చేస్తూ... సురేష్ ప్రభు దర్శకత్వంలో ఏఆర్ మూవీ మేకర్స్ పతాకంపై ఏఆర్ రాకేష్ నిర్మిస్తున్న సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా... దర్శకుడు గోపిచంద్ మలినేని క్లాప్ కొట్టారు. మరో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాతగా తొలి చిత్రమైనా... ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మిస్తానని, సురేష్ ప్రభు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పానని నిర్మాత ఏఆర్ రాకేష్ అన్నారు. "ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. ఆదివారం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం" అని దర్శకుడు సురేష్ ప్రభు తెలిపారు.
ఈ సినిమాకు మహావీర సంగీతం అందిస్తున్నారు. ఇందులో తానొక మంచి పాత్ర చేస్తున్నాని నటుడు 'చిత్రం' శీను తెలిపారు.
దర్శక నిర్మాతలకు గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ అందించారు. ఈ సినిమా రెగ్యులర్ సినిమాల తరహాలో కాకుండా కొత్తగా ఉంటుందని, స్క్రీన్ ప్లే పరంగా ఉత్కంఠభరితంగా ఉంటుందని మాటల రచయిత ప్రశాంత్ శర్మ తెలిపారు.
ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా రానున్న పవన్ కళ్యాణ్ - ‘సాహో’ సుజీత్‌కు గోల్డెన్ ఛాన్స్!
Pooja Hegde: పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి- పట్టుచీరలో మెరిసిన బుట్టబొమ్మ
Nabha Natesh: తెల్ల చీరలో అబ్బా అనిపిస్తున్న నభా నటేష్
Malavika Mohanan: వెస్ట్రన్ డ్రెస్సుతో కుర్రాళ్ల మతి పోగొడుతున్న మాళవిక మోహనన్
Hansika Motwani: చూపుతిప్పుకోలేనంత అందంతో కొత్త పెళ్లికూతురు హన్సిక
Jagityala మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి రాజీనామాకు కలెక్టర్ ఆమోదం
Lokesh Yuvagalam ; ఏపీ , కర్ణాటక మధ్య పెట్రోల్ ధరల్లో ఎంత తేడా అంటే ? పాదయాత్రలో లోకేష్ చూపించారు...
టీడీపీ నేతలకు షాక్ - పరువు నష్టం దావా వేసిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక