అన్వేషించండి
Visakha Public Library: అడవి కాదు లైబ్రరీ, ఆకట్టుకుంటున్న వైజాగ్ లైబ్రరీ ఫొటోస్ చూశారా
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/107219710c0c0d19f294a7a21613cd96_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైజాగ్ పబ్లిక్ లైబ్రరీ
1/7
![విశాఖలో కొత్తగా ఏర్పాటైన మియావాకి లైబ్రరీ పిల్లలను, విద్యార్థులను భలే ఆకట్టుకుంటోంది. ఈ పద్దతిలో ఒక హాల్ ను మొత్తం అడవిని ప్రతిబించేలా రూపొందించారు వైజాగ్‌లోని పబ్లిక్ లైబ్రరీ అధికారులు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/39811e6232f02f59cfec0e6f03486f5008140.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విశాఖలో కొత్తగా ఏర్పాటైన మియావాకి లైబ్రరీ పిల్లలను, విద్యార్థులను భలే ఆకట్టుకుంటోంది. ఈ పద్దతిలో ఒక హాల్ ను మొత్తం అడవిని ప్రతిబించేలా రూపొందించారు వైజాగ్‌లోని పబ్లిక్ లైబ్రరీ అధికారులు.
2/7
![స్మార్ట్‌ఫోన్లనూ, ఆన్‌లైన్ గేమ్స్‌ను పక్కన పడేసి పుస్తక పఠనం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. టెక్నాలజీ తెచ్చే సౌకర్యాలతో పాటు కొన్ని అవలక్షణాలు కూడా పిల్లల్లో పెరుగుతున్నాయి అంటారు చైల్డ్ సైకాలజిస్ట్‌లు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/bc76153df3189deb0d328564dc168f49aa92e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్మార్ట్‌ఫోన్లనూ, ఆన్‌లైన్ గేమ్స్‌ను పక్కన పడేసి పుస్తక పఠనం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. టెక్నాలజీ తెచ్చే సౌకర్యాలతో పాటు కొన్ని అవలక్షణాలు కూడా పిల్లల్లో పెరుగుతున్నాయి అంటారు చైల్డ్ సైకాలజిస్ట్‌లు.
3/7
![చిన్న వయస్సులోనే పెద్దలు చెప్పినమాట వినకపోవడం, మొండిగా తయారవడం లాంటి అలవాట్లు దరిచేరుతున్నాయి. అలాకాకుండా వాళ్లను ఆరోగ్యకరమైన బుక్ రీడింగ్ వైపు మరల్చడానికి వైజాగ్ లైబ్రరీ సిబ్బంది చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తున్నాయని వారు చెబుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/f50dc6d7f012ad5938d5a5ac10b478229d72a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్న వయస్సులోనే పెద్దలు చెప్పినమాట వినకపోవడం, మొండిగా తయారవడం లాంటి అలవాట్లు దరిచేరుతున్నాయి. అలాకాకుండా వాళ్లను ఆరోగ్యకరమైన బుక్ రీడింగ్ వైపు మరల్చడానికి వైజాగ్ లైబ్రరీ సిబ్బంది చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తున్నాయని వారు చెబుతున్నారు.
4/7
![జపాన్ భాషలో మియావాకి (Akira Miyawaki) అంటే అర్బన్ ఫారెస్ట్ అని అర్ధం. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను లేదా వృక్షాలను పెంచడం అనే కాన్సెప్ట్‌ను జపాన్ దేశానికి చెందిన అకిరా మియావాకి అనే వృక్ష శాస్త్రవేత్త ప్రతిపాదించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/f155e32dcddc829111da21acbb282218dc81c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జపాన్ భాషలో మియావాకి (Akira Miyawaki) అంటే అర్బన్ ఫారెస్ట్ అని అర్ధం. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను లేదా వృక్షాలను పెంచడం అనే కాన్సెప్ట్‌ను జపాన్ దేశానికి చెందిన అకిరా మియావాకి అనే వృక్ష శాస్త్రవేత్త ప్రతిపాదించారు.
5/7
![రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం, పట్టణీకరణకు ఇదే సరైన పరిష్కారం అనేది ఆయన సిద్ధాంతం. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/437fdd031a998962eefdba8f3058e741693d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం, పట్టణీకరణకు ఇదే సరైన పరిష్కారం అనేది ఆయన సిద్ధాంతం. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాయి.
6/7
![IT కంపెనీలు, వ్యాపార సంస్థలు,పెద్దపెద్ద అపార్ట్ మెంట్లలో కొంత భాగంలో మొక్కలను పెంచడానికి కేటాయించడం లేదా కనీసం అలాంటి వాతావరణాన్ని కృత్రిమంగానైనా చెయ్యడం మొదలుపెట్టాయి. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా వైజాగ్‌లోని పబ్లిక్ లైబ్రరీలో ఈ మియావాకి లైబ్రరీ ని ఏర్పాటు చేసి పిల్లల్ని ఆకట్టుకుంటున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/5ba31a80904d1baf6aad89ca3dc57ec839d6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
IT కంపెనీలు, వ్యాపార సంస్థలు,పెద్దపెద్ద అపార్ట్ మెంట్లలో కొంత భాగంలో మొక్కలను పెంచడానికి కేటాయించడం లేదా కనీసం అలాంటి వాతావరణాన్ని కృత్రిమంగానైనా చెయ్యడం మొదలుపెట్టాయి. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా వైజాగ్‌లోని పబ్లిక్ లైబ్రరీలో ఈ మియావాకి లైబ్రరీ ని ఏర్పాటు చేసి పిల్లల్ని ఆకట్టుకుంటున్నారు.
7/7
![ఈ మియావాకి హాల్‌లో ఒకేసారి 25 నుండి 30 మంది పిల్లలు కూర్చుని చదువుకోవచ్చు. దానికోసం 2000 వరకూ పుస్తకాలను ఏర్పాటు చేశారు. వీటిలో పిల్లలకు నచ్చే చిల్డ్రన్ బుక్స్‌తోపాటు పెద్దబాలశిక్ష, మన ఇతిహాసాల వంటి పుస్తకాలు కూడా ఉన్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/828d098cdd16c337cb16061a62129609f49d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మియావాకి హాల్‌లో ఒకేసారి 25 నుండి 30 మంది పిల్లలు కూర్చుని చదువుకోవచ్చు. దానికోసం 2000 వరకూ పుస్తకాలను ఏర్పాటు చేశారు. వీటిలో పిల్లలకు నచ్చే చిల్డ్రన్ బుక్స్‌తోపాటు పెద్దబాలశిక్ష, మన ఇతిహాసాల వంటి పుస్తకాలు కూడా ఉన్నాయి.
Published at : 28 Jun 2022 08:01 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
న్యూస్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion