అన్వేషించండి
YSRCP Chief Jagan: రోడ్డు మార్గంలో పులివెందులకు జగన్ ప్రయాణం- మార్గ మధ్యలో కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం
Jagan: ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిలోమీటర్ల దూరం ప్రయాణానికి కూడా హెలికాప్టర్ వాడే జగన్ చాలా కాలం తర్వాత రోడ్డు మార్గంలో ప్రయాణం చేశారు. మూడు రోజు కడప జిల్లా టూర్‌లోఈ దృశ్యం కనిపించింది.
రోడ్డు మార్గంలో పులివెందులకు జగన్ ప్రయాణం
1/7

ఈ ఉదయం తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. మూడు రోజుల పాటు కడప జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.
2/7

2024లో ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత జగన్ తొలిసారిగా సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎప్పుడూ హెలికాప్టర్‌లో వెళ్లే ఆయన తొలిసారి రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకున్నారు.
3/7

కడప విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌ను చూసేందుకు భారీగా వైసీపీ శ్రేణులు తరలి వచ్చాయి. వారందరికీ అభివాదం చేస్తూ జగన ప్రత్యేక కాన్వాయ్‌లో పులివెందుల పయనం అయ్యారు.
4/7

మూడు రోజుల పాటు కడపలో పర్యటించనున్న జగన్ అక్కడ నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు వాళ్ల చర్చించనున్నారు. వచ్చే ఐదేళ్లు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేయనున్నారు.
5/7

2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జగన్ కచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తానని నమ్మారు. అయితే అందుకే విరుద్దమైన తీర్పును ప్రజలు ఇచ్చారు.
6/7

175 స్థానాల్లో పోటీ చేసిన జగన్‌కు ప్రజలకు కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. చాలా జిల్లాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది వైసీపీ. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయిన జగన్ ఈసారి కేవలం ఎమ్మెల్యేగానే శుక్రవారం ప్రమాణం చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి అయినందున ఆయనతో మంత్రుల తర్వాత ప్రమాణం చేయించారు.
7/7

పులివెందులకు వెళ్తున్న జగన్ కాన్వాయ్ మార్గ మధ్యలో ప్రజల కోసం ఆగింది. ఈ క్రమంలోనే ఫైర్ ఇంజిన్ ఉన్న వాహనం వేరే వాహనాన్ని ఢీ కొట్టింది.
Published at : 22 Jun 2024 02:04 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















