ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.
సాయితేజ పార్థివదేహం ఉదయం 5.45 గంటలకు బెంగళూరులోని ఎలహంక ఆర్మీ బేస్ నుంచి రోడ్డు మార్గం ద్వారా చిత్తూరు జిల్లాకు చేరుకుంది. పుంగనూరు రోడ్డు మార్గం గుండా ఆయన స్వగ్రామంమైన ఎగువరేగడకు ర్యాలీగా చేరుకుంటుంది.
ముందుగా ఆయన అభిమానులు, స్నేహితులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పుంగనూరు మార్గం వద్దకు చేరుకుని అక్కడ నివాళి అర్పించారు.
భౌతిక కాయం 9:30 గంటల సమయానికి మదనపల్లి శివారులో వద్దకు చేరుకొంది. మదనపల్లి పట్టణం అంగళ్ళు మిట్స్ కాలేజీ, విశ్వం కాలేజీల మీదుగా ఎగువ రేగడ గ్రామానికి దాదాపు 25 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి గ్రామానికి చేరుకుంది. ఈ ర్యాలీ దాదాపు రెండు గంటల పాటు సాగింది.
ఎగువ రేగడ గ్రామంలో కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్ధం ఉంచి మధ్యాహ్నం సాయితేజ అంత్యక్రియలు నిర్వహిస్తారు.
మరోవైపు సాయితేజ నివాసం వద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సైనిక లాంఛనాలతో సాయితేజకు కడసారి తుది వీడ్కోలు ఇండియన్ ఆర్మీ పలకనుంది.
దాదాపుగా ఐదు రోజుల అనంతరం సాయితేజ పార్ధిదేహం స్వగ్రామంకు చేరుకుంది.. హిందూ సాంప్రదాయం ప్రకారం సాయితేజకు అంతిమ సంస్కారం చేయనున్నారు కుటుంబ సభ్యులు.
Kangana Ranaut at Tirumala today: తిరుమలలో కంగనా రనౌత్, విష్ణు మంచుకు ఎందుకు థాంక్స్ చెప్పారంటే?
In Pics: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, చూసి తరించండి
In Pics : రేపటి నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు
In Pics : తిరుమలలో శోభాయమానంగా కోదండరాముడి పుష్పయాగం
In Pics : కన్నుల పండుగా ఒంటిమిట్ట రాములోరి కల్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు
Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్ 303, నిఫ్టీ 99 డౌన్ - ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్!
Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?