1948లో డాలర్ శేషాద్రి జన్మించారు. అసలు పేరు పాల శేషాద్రి. మెడలో పోడువైన డాలర్ ధరించి ఉండడం వల్ల డాలర్ శేషాద్రిగా పేరు. శేషాద్రి పూర్వీకులు తమిళనాడు రాష్ర్టంలోని కంచికి చెందినవారు.
తిరుమల నంబి ఆలయంలో శేషాద్రి తండ్రి స్వామి గుమస్తాగా విధులు నిర్వర్తించారు. శేషాద్రి తిరుపతిలోనే జన్మించి విద్యాభ్యాసం పూర్తిచేశారు. అప్పట్లోనే పీజీ వరకూ చదివారు.
1978లో టీటీడీలో చేరారు. 2006 జూన్‌లో రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి ఒఎస్డీగా కొనసాగుతున్నారు. శేషాద్రికి భార్య చంద్ర, ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. 2013లో కిడ్ని ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది.
2016లో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో చికిత్స అనంతరం శేషాద్రి కోలుకున్నారు. 2006లో శేషాద్రిపై బంగారు డాలర్ల మిస్సింగ్ అభియోగం మోపారు. విచారణలో ఆయన సచ్ఛీలుడిగా బయటపడ్డారు.
2009లో అప్పటి ఈవో క్రిష్ణారావు ఆదేశాలు మేరకు తొమ్మిది నెలలు విధులకు శేషాద్రి దూరమైయ్యారు. తిరిగి కోర్టు ఆదేశాలతో విధులలో చేరారు. సర్వీసులో 15 నెలలు కాలం మినహయిస్తే పూర్తిగా శ్రీవారి సన్నిధిలో డాలర్ శేషాద్రి విధులు నిర్వర్తించారు.
ఏడు కొండల్లో ఒకటైన.. శేషాద్రి.. పేరుతో ఉన్న డాలర్ శేషాద్రి అంతటి ప్రసిద్ధుడు. 43 ఏళ్లుగా స్వామి సేవలోనే ఆయన తరిస్తున్నారు. టీటీడీలో ఉద్యోగి అయినప్పటికీ.. ఆయన ఆహార్యం రీత్యా అందరూ అర్చకులు అనుకుంటారు.
తిరుమల ఆలయం ముందు డాలర్ శేషాద్రి లేని.. వీఐపీ ఫోటో ఉండదు అంటే అతిశయోక్తి కాదు. చిన్న రాజకీయ నేతల నుంచి రాష్ట్రపతుల వరకూ అయనకు అందరితో నేరుగా పరిచయం.
స్వామికి అత్యంత భక్తుడైన.. మాజీ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు శేషాద్రి ఎంతో సన్నిహితులు.
వేంకటాద్రిలో జన్మించి.. సింహద్రిలో ప్రాణాలు విడిచిన డాలర్ శేషాద్రి. సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణతోనూ సన్నిహిత సంబంధాలు.
తిరుమల పర్యటన సందర్భంగా స్వయంగా శేషాద్రి ఇంటికి వెళ్ళిన జస్టిస్ ఎన్వీ రమణ. చివరి తిరుమల పర్యటన సమయంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, మరోసారి తిరుమలకు విచ్చేసిన సమయంలో ఇంటికి వస్తానని శేషాద్రికి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
యువ గళాన్ని వినిపించి పసుపు దళాన్ని నడిపించడానికి బయల్దేరిన లోకేష్
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేష్
Parveta Utsavam In Tirumala: శ్రీవారి ఆలయంలో వైభవంగా పార్వేట ఉత్సవం, కనుమ నాడు ఆనవాయితీ
నారావారిపల్లెలో చంద్రబాబు భోగి మంటలు, జీవో నెంబర్ 1 కాపీలు తగులబెట్టి నిరసన
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!