దేశ రాజధాని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నగరాల మధ్య నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది.
తిరుపతి - ఢిల్లీ మధ్య స్పైస్ జెట్ విమానాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం ప్రారంభించారు.
స్పైస్ జెట్ సంస్థ విమాన సర్వీసు అందిస్తోంది. మొట్టమొదటి విమానాన్ని ఆదివారం ఉదయం 9.50 గంటలకు ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా జెండా ఊపి లాంఛన ప్రాయంగా ప్రారంభించారు. ఢిల్లీలో బయలుదేరిన స్పైస్ జెట్ విమానం తిరుపతికి చేరుకున్నది.
విమాన సర్వీసు ప్రారంభించిన అనంతరం సింధియా మాట్లాడుతూ.. స్పైస్ జెట్ సంస్థ నూతన విమాన సర్వీసు దేశ రాజధాని ఢిల్లీని, ఏపీలోని ఆధ్యాత్మిక రాజధాని తిరుపతితో కలుపుతున్నదని చెప్పారు. ఢిల్లీ, దేశ రాజధాని సమీప ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకునేందుకు ఈ సర్వీసు ఉపయోగపడుతుందన్నారు. ఏటా కోట్లాది భక్తులు ఢిల్లీ నుంచి తిరుమలకు వెళ్తుంటారని తెలిపారు.
విద్యార్థులకు నిన్న జగనన్న విద్యా దీవెన - నేడు రాగి జావ
బడ్జెట్ ప్రతులకు పూజ చేసిన బుగ్గన
రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నిరసన
సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ధర్నా
Pawan Kalyan : వారాహిపై పవన్ కల్యాణ్, కదంతొక్కిన జనసైనికులు
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా