అన్వేషించండి
In Pics : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.
![తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/28b1fb73b1dc58b83e0ce7a53d5d117e1664208459277235_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
1/16
![తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/a4e87137a4825d31265e09c0d929483736ff5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
2/16
![తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/b8b6c5f45d366a0ab0824ac69cc3b1091a1d9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు.
3/16
![తిరు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/fd6188d72477f84dc5fc2605360a76435228d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
4/16
![విద్యుత్ వెలుగుల్లో తిరుమల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/5ea7b369e1d5d7257f372de011264760a019c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
విద్యుత్ వెలుగుల్లో తిరుమల
5/16
![వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/74fb439be1b83fab269a21c0b8fa5c03c2a68.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.
6/16
![సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహిస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/22c26d72fa1fcb313bd209b3653c461d85500.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహిస్తారు.
7/16
![విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/9875d5215cab44f6041adcd2e35a293a37957.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.
8/16
![అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలోని నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/5acba5c8ed60ba4c6130742cf94c73b60c0f1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలోని నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.
9/16
![భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/d4dc84c706799a9c3df06f2166310616107c2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు.
10/16
![తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/470748cbc886b905bd9e621f23f2369eb40ec.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ
11/16
![తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/2f832376d2e560812b3260267c169d7e3a413.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
12/16
![ఈ కార్యక్రమంలో చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఏవీ.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/d2e3fb4bcf006e8e4a9388073969af71a16c0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ కార్యక్రమంలో చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఏవీ.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
13/16
![తిరుమలలో విద్యుత్ దీపాల అలంకరణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/47b29ca50e1826408d6de091aac52ff26e799.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో విద్యుత్ దీపాల అలంకరణ
14/16
![తిరుమలలో విద్యుత్ దీపాల అలంకరణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/4f38ff1e3ff8e14bd1d489c858e9793d85207.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో విద్యుత్ దీపాల అలంకరణ
15/16
![తిరుమలలో విద్యుత్ దీపాల అలంకరణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/c1681d440d7df174aff666bfaf304c33c9ebb.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో విద్యుత్ దీపాల అలంకరణ
16/16
![తిరుమలలో విద్యుత్ దీపాల అలంకరణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/26/77677f8f453a3b54cfcf7e5e020bb8b3896fb.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో విద్యుత్ దీపాల అలంకరణ
Published at : 26 Sep 2022 09:44 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
పర్సనల్ ఫైనాన్స్
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion