అన్వేషించండి

Youngest Billionaires : ఇరవై ఏళ్లకే బిలియనీర్లయిపోయారు - తాత, ముత్తాతల ఆస్తితో కాదు - Zepto ఫౌండర్ల కథ ఇదే

Zepto founders : జెప్టో వ్యవస్థాపకులు ఇరవై ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు. తాత, ముత్తాతల ఆస్తిని పెట్టుబడిగా పెట్టలేదు. తమ తెలివి తేటల్ని ఐడియాల్నే పెట్టుబడిగా పెట్టారు.

Zepto founders became billionaires in their twenties :  సాధారణంగా ఇరవై ఏళ్లకు మనం ఏం చేస్తూ ఉంటాం. డిగ్రీ లేదా ఇంజినీరింగ్ చివరికి వచ్చేసి.. తర్వాత ఏం  చేయాలా అని ఆలోచిస్తూంటాం. క్యాంపస్ ఇంటర్యూలో నాలుగైదు లక్షల ప్యాకేజీతో జాబ్ వస్తుందా లేదా అని కంగారు పడుతూంటాం. కానీ స్టార్టప్ కంపెనీ జెప్టో వ్యవస్థాపకులు మాత్రం ఆ వయసుకే బిలియనీర్లు అయిపోయారు. వారిద్దరి పేర్లు కైవల్య వోహ్రా, ఆదితి పాలిచా.     

జెప్టో ఈ పేరు నగరాల్లో ఉన్న వారందరికీ పరిచయమే. పది అంటే పది నిమిషాల్లో ఆర్డర్ ను డెలివరీ చేసేస్తారు. ఇది సాధ్యమా అని అనుకునేవారు ఉంటారు.. కానీ పది నిమిషాల కంటే ముందే డెలివరీ చేసేస్తారు. ఈ స్టార్టప్ ను ప్రారంభించినప్పుడు కైవల్య , అదితిల వయసు ఇరవై కంటే తక్కువే. స్టార్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకోవాలని వీరిద్దరూ ముంబై నుంచి వెళ్లారు కానీ కరోనా కారణంగా తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. ఖాళీగా ఉండటం ఎందుకని.. కరోనా లాక్ డౌన్ సమయంలో.. కిరాణాకార్ట్ అని  యాప్ రెడీ చేసి.. స్టార్టప్ ప్రారంభించారు. మొదట నలభై ఐదు నిమిషాల్లో కిరాణా సామాన్లను డెలివరీ చేయడం ప్రారంభించారు. అయితే వీరిద్దరికీ లాజిక్ అర్థమయ్యే సరికి కిరాణాకార్ట్ వెనుకబడిపోయింది. దాంతో మూసివేయక తప్పలేదు.   

73 సార్లు ఇన్వెస్టర్లు తిప్పి పంపేశారు కానీ ఇప్పుడు రూ.52 వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు - ఈ స్టార్టప్ కపుల్ గురించి విన్నారా?

కానీ ఈ ఆన్ లైన్ కిరణా వస్తువుల డెలివరలో అపారమైన అవకాశాలు ఉన్నాయని అప్పుడే గుర్తించారు. ఇతర పెద్ద  బ్రాండ్లు ఉన్నప్పటికీ.. తమ తెలివితేటలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా..కిరణాకార్ట్ యాప్ ని జెప్టో పేరుతో రీ బ్రాండ్ చేశారు. పెట్టుబడిదారులను ఆకర్షించారు. పది అంటే పది నిమిషాల్లో డెలివరీ పేరుతో తెరపైకి వచ్చారు. అది ఇన్  స్టంట్ హిట్ అయిపోయింది. ఇప్పుడీ కంపెనీ వాల్యూ ఎవరూ ఊహించని స్థాయికి చేరిపోయింది. కైవల్యతో పాటు అతిది బిలియనీర్ల జాబితాలో చేరిపోయారు. అంతా మూడేళ్లలో జరిగిపోయింది.                     

ఇంతా  చేసి కైలవ్య వోహ్ర వయసు ఇరవై ఒక్క ఏళ్లు మాత్రమే. అదితి పాలిచా వయసు ఇరవై రెండేళ్లు. మొదటి నుంచి వీరిద్దరూ స్నేహితులే. ముంబైలోనే పెరిగారు. ఇప్పుడు దేశంల అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్లు. వీరు అచ్చంగా తమ ఆలోచనలు.. తెలివి తేటల మీద బిలియనీర్లుగా అయ్యారు. వారసత్వంతో వచ్చిన ఆస్తులతో కాదు. ఇక్కడే అసలు విజయం దాగి ఉందని అనుకోవచ్చు.                   

యూకే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఫాస్ట్ - పదిహేనేళ్లకే కానిచ్చేస్తున్నారట !

వయసు చిన్నదే అయినా.. స్టడీస్ డిస్ కంటిన్యూ చేసినా.. ఆర్థికపరమైన సవాళ్లు ఎదురైనా వీరిద్దరూ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. పది నిమిషాల్లో డెలివరీకి అవసరమైన పక్కా ఏర్పాట్లతో రంగంలోకి దిగారు. అనుకున్నది సాధించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
CM Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
TDP: గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
CM Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
TDP: గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Prabhas: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ డీల్ - ఆ మూడు సినిమాలకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?
BSNL Best Long Term Plans: ఒక్క రీఛార్జ్‌తో 395 రోజుల వ్యాలిడిటీ - 790 జీబీ అందించే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ - ధర ఎంతంటే?
ఒక్క రీఛార్జ్‌తో 395 రోజుల వ్యాలిడిటీ - 790 జీబీ అందించే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ - ధర ఎంతంటే?
High Court:టీవీ చూడనివ్వకపోవడం, కింద పడుకోమని చెప్పడం గృహహింస కాదు - కీలక తీర్పు ఇచ్చిన ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్
టీవీ చూడనివ్వకపోవడం, కింద పడుకోమని చెప్పడం గృహహింస కాదు - కీలక తీర్పు ఇచ్చిన ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్
Embed widget