UK Girls : యూకే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఫాస్ట్ - పదిహేనేళ్లకే కానిచ్చేస్తున్నారట !
UK Girs WHO Report : యునైటెడ్ కింగ్ డమ్‌లో పదిహేనేళ్లలోపు అమ్మాయి...అబ్బాయిల కంటే చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యూకే అమ్మాయిలపై కీలకమైన విషయాలను వెలల్డించింది.
More 15-year-old girls in UK are having Affairs than boys of same age : ప్రపంచంలోని అన్ని దేశాల్లోకెల్లా యూకేలోని పదిహనేళ్లలోపు బాలికలు ఎక్కువ ఫాస్ట్ గా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికను వెల్లడించింది. శారీరక సంబంధాలను ఆ వయసుకే పెట్టేసుకుంటున్నారని కానీ బాలురు మాత్రం అంత ఫాస్ట్ గా లేరని నివేదిక తేల్చింది. అదే సమయంలో శారీరకసంబంధాలు పెట్టుకుంటున్న సమయంలో బాలికలు కండోమ్స్ లాంటి రక్షణ చర్యలను తీసుకోవడానికి ఆసక్తి కనబరచడం లేదట. ఇది వారిలో లైంగిక వ్యాధులు.. గర్భం రావడానికి అయ్యే అవకాశాలను పెంచుతోందని WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కేరళ సినీ పరిశ్రమలో జాతీయ ఉత్తమ చిత్రం "ఆట్టం" కథే రిపీట్ - ఇప్పుడు జరుగుతోదంంతా అదే నాటకం !
యూకలో ఉన్న ఈ పరిస్థితుల వల్ల అక్కడ లైంగిక విజ్ఞానంపై మరింత ఎక్కువగా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని.. స్కూల్లో హెల్తీ బిహేవియర్‌గా ఇంకా ఎక్కువగా అవగాహన కల్పించాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రపంచఆరోగ్య సంస్థకు చెందిన రీసెర్చర్లు మొత్తంగా 2 లక్షల 42 వేల మందిని 42 దేశాల్లో పదిహేనేళ్ల లోపు వాళ్లని ప్రశ్నించి ఈ నివేదిక రెడీ చేశారు. అది అత్యంత సుదీర్ఘంగా జరిగిన సర్వే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 2014-2022 మధ్య ఈ అభిప్రాయ సేకరణ జరిపారు.
ఈ సర్వేలో ఇంగ్లాండ్ లోని పదిహేనేళ్ల బాలికల్లో 21 శాతం మంది శృంగార అనుభవాన్ని రుచి చూశారు. ఇతర దేశాల్లో యావరేజ్ గా ఇది పదిహేను శాతం మత్రమే ఉంది. ఇక శృంగారం చేసేటప్పుడు కండోమ్ వినియోగించామని చెప్పిన వారి సంఖ్య 48 శాతంగా ఉంది. కానీ ఇతర దేశాలతో పోలిస్తే యావరేజ్‌గా 57 శాతం ఉంది. ఓ రకంగా ఇంగ్లాండ్ యువతులకు వీటి గురించి అవగాహన తక్కువ ఉన్నట్లే. అదే సమయంలో ఇతర కాంట్రాసెప్టివ్ ప్లిస్ వాడకంపైనాపెద్దగా ఆసక్తి చూపించలేదు. హాంకాంగ్‌లో ప్రిమారిటల్ సెక్స్ కన్నా బ్యాడ్మింటన్ ఆడుకోవడం మంచిదని అక్కడి ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నట్లుగా WHO తెలిపింది.
షాకింగ్ రిపోర్ట్, భారత్‌లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు - ఆ రాష్ట్రాల్లో మరీ దారుణం
మగపిల్లల్లో పదిహేనేళ్లలోపు శృంగారం చేసే వారి సంఖ్య బ్రిటన్‌లో తగ్గిపోతోంది. యూకేలో పద్దెనిమితి శాతం మంది పదిహేనేళ్లలోపు బాలురు మాత్రమే శృంగారం చేస్తున్నారు. గతంలో పోలిస్తే ఇది నాలుగు శాతం తగ్గిపోయింది. అదే అన్ని దేశాల్లో కలిపి అయితే.. యావరేజ్ ఇరవై శాతం ఉంది. శృంగారంలో పాల్గొంటున్న పదిహేళ్లలోపు యూకే బాలురల్లో అరవై ఒక్క శాతం మంది కండోమ్ వాడుతున్నారు. WHO విడుదల చేసిన ఈ గణాంకాలు యూకే భవిష్యత్ తరాన్ని కాస్త ఆందోళన చెందేలా చేస్తున్నాయి. అక్కడి పిల్లల్లో మరింత లైంగిక విజ్ఞానం పెంచేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తన్నాయి.