అన్వేషించండి

Kerala Film Industry Aattam : కేరళ సినీ పరిశ్రమలో జాతీయ ఉత్తమ చిత్రం "ఆట్టం" కథే రిపీట్ - ఇప్పుడు జరుగుతోదంంతా అదే నాటకం !

Malayalam Aattam : హేమ కమిటీ రిపోర్టు తర్వాత మలయాళ ఇండస్ట్రీలో వేధింపులకు గురైన నటీమణులు వరుసగా తమకు జరిగిన అన్యాయాల్ని ప్రశ్నిస్తున్నారు. మోహన్ లాల్ పైనా నటి పార్వతి పిరికిపంద ఆరోపణలు చేశారు.

Malayalam film Attham story Like  developments in Malayalam film industry :  మలయాళ నటీ నటుల సంఘం "అమ్మ"  కార్యవర్గం రాజీనామా చేసింది. ఈ కార్యవర్గానికి సూపర్ స్టార్ మోహన్ లాల్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనతో సహా అందరూ రాజీనామాలు చేశారు. ఈ అంశంపై  ప్రముఖ నటి పార్వతి తిరువోతు ఘాటుగా స్పందించారు. మోహన్ లాల్‌ను వెన్నుపోటుదారునిగా అభివర్ణించారు.  సీనియర్ నటుడిగా సమస్యకు పరిష్కారం చూపకుండా మోహన్ లాల్ రాజీనామా చేసి తన పిరికితనం చాటుకున్నారని పార్వతి ఆరోపించారు. ఇలా నటీమణులు ఒకరి తర్వాత ఒకరు.. ఆరోపణలు చేస్తూ పోతున్నారు. 

మలయాళ ఇండస్ట్రీలో చిచ్చు పెట్టిన హేమ కమిటీ 

మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఏడేళ్ల కిందట ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమ కమిటీ నివేదిక చిచ్చు పెట్టింది. వేధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయని అందులో పలు ఘటనల్ని.. పలువురు నటీమణుల అభిప్రాయాల్ని చేర్చింది. ఆ నివేదిక బయటకు వచ్చిన తర్వాత చాలా మంది నటీనటులు తమకు గురైన వేధింపుల గురించి బహిరంగంగా చెప్పడం ప్రారంభించారు. ఇవి చినికి చినికి గాలి వానగా మారుతున్నాయి. సీనియర్ నటుడు సిద్ధిఖ్ తనపై అత్యాచారం చేశారని నటి రేవతి సంపత్ ఆరోపించారు. ఇలా ఒక్కొక్కరూ సీనియర్ నటులపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ మీడియాలో సంచలనం అవుతున్నాయి. 

మాలీవుడ్‌లో మృగాళ్ల పేర్లు బయట పెట్టాలి - హేమ కమిటీ రిపోర్టుపై మలయాళ డైరెక్టర్స్ డిమాండ్

జాతీయ ఉత్తమ చిత్రం ఆట్టం తరహా సన్నివేశాలే    

ఇటీవల కేంద్ర జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. ఇందుల ఆట్టం అనే సినిమాను జాతీయ ఉత్తమ చిత్రంగా  ప్రకటించారు. ఈ సినిమా కథ మహిళలపై లైంగిక వేధింపుల గురించే. ఆట్టం అంటే నాటకం. ఓ నాటక గ్రూపులో పదకొండు మంది మగాళ్లు ఉంటే.. ఒక్కరే హీరోయిన్ ఉంటారు. ఈ హీరోయిన్ తో  ఓ రాత్రి ఆ పదకొండు మందిలో ఒకరు అసభ్యంగా ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించింది ఎవరు అనే తెలుసుకునే క్రమంలో వారు వ్యవహరించిన విధానం.. మహిళల్ని తప్పు పట్టే వైనం.. అందరూ చూపించిన స్వార్థం .. ఇలా అన్నీ కలగలిపి ఆ నటికి విరక్తి పుట్టిస్తాయి. తనతో అసభ్యంగా  ప్రవర్తించిన వ్యక్తికి...మిగతా వారికి పెద్దగా తేడా లేదని.. అందరూ ఒకే రకమైన మనస్థత్వాలు ఉన్నవారని.. నిజంగా ఎవరు తనతో అసభ్యంగా ప్రవర్తించారో తెలుసుకునే ఆసక్తి లేదని చెప్పడమే క్లైమాక్స్. 

మలయాళ ఇండస్ట్రీలో ఆడవాళ్లపై లైంగిక వేధింపులు - వెలుగులోకి సంచలన విషయాలు, హేమ కమిటీ ఏం చెబుతుందంటే!

అదే  కథ ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమలో సాక్షాత్కారం

ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమలో అందరూ అదే తరహాలో ప్రవర్తిస్తున్నారు. తమపై వేధింపుల గురించి సూపర్ స్టార్లకు కూడా తెలుసని.. కానీ వారు పట్టించుకోలేని  కొంత మంతి చెబుతున్నారు. కొంత మంది అవకాశాల కోసం సైలెంట్ గా ఉండక తప్పదని అంటున్నారు. అదే సమయంలో అలా వేధింపులకు గురయ్యారని ప్రకటిస్తున్న వారిపైనా పలు రకాల రూమర్స్ ప్రచారంలోకి వస్తున్నాయి.  ఇలా మహిళలపై వేధింపుల విషయంలో.. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ నాటకం జరుగుతోంది. అందరూ ఒక్కటేనని ఈ నాటకంలో పాత్రలు నిరూపిస్తున్నట్లుగా ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Investment Tips: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
Embed widget