Hema Committee: మలయాళ ఇండస్ట్రీలో ఆడవాళ్లపై లైంగిక వేధింపులు - వెలుగులోకి సంచలన విషయాలు, హేమ కమిటీ ఏం చెబుతుందంటే!
Hema Committee Report: మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులపై నియమించిన హేమ కమిటీ రిపోర్టు నివేదికలోని అంశాలు సంచలనం రేపుతున్నాయి. ఇండస్ట్రీలో ఆడవాళ్లపై వేధింపులు నిజమేని అని స్పష్టం చేసింది.
Hema Committee Report on Malayalam Industry: మలయాళ ఇండస్ట్రీ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇండస్ట్రీలో మహిళలు లైంగిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ కమిటీ తన రిపోర్టులో తెల్చి చెప్పింది. అంతేకాదు మాల్లీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న చీకటి కోణాలను హేమ కమిటీ బట్టబయలు చేసింది. కాగే ఆరేళ్ల క్రితం ఓ నటిపై స్టార్ నటుడు దిలీప్ అతని అనుచరులు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన సౌత్ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసులో దిలీప్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
ఈ కేసుపై కొన్ని సంవత్సరాలు కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఈ కేసుపై ఆమె న్యాయపోరాటం చేస్తూనే ఉంది. అయితే ఈ కేసు నేపథ్యంలోనే అప్పటి కేరళ ప్రభుత్వం మాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటోన్న లైంగిక వేధింపులపై అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019 మాజీ జస్టిస్ హేమ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీలో సీనియర్ నటి శారద, కేబీ వల్సల కుమారి తదితరులు ఉన్నారు. ఇటీవల ఈ కమిటీ తమ నివేదిక కేరళ సీఎం పినరయి అందించింది. తాజాగా ఇందులో అంశాలు స్వయంగా ప్రభుత్వమే బయటపెట్టింది.
హేమ కమిటీ నివేదిక ప్రకారం.. మాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందని, దీని ఎందరో నటీమణులు బాధితులుగా వారి వివరాలతో సహా పేర్కొంది. నివేదిక పొందుపరిచినట్టు తెలుస్తోంది. కాస్టింగ్ కౌచ్‌తో పాటు మహిళలపై లైంగిక దోపిడికి సంబంధించిన సంచలన విషయాలను ఈ కమిటీ రిపోర్టులో వెల్లడించింది. ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు, దోపిడి, అసభ్యకరమై ప్రవర్తనగా ప్రవర్తించడం సహజంగా మారిందని స్పష్టం చేసింది. నటీమణులు అవుట్ డౌర్ షూటింగుకు వెళ్లినప్పుడు వారు బస చేసే హోటల్ గదుల తలుపులు అర్థరాత్రి కొట్టడం, బలవంతం వారి రూమ్‌లోకి ప్రవేశించడం చేస్తారని పేర్కొంది. ఈ కారణంగానే నటీమణులు అవుట్ డోర్ షూటింగ్‌కి తమ వారిని వెంటబెట్టుకుని వెళుతున్నట్లు నివేధికలో తెలిపారు.
మళయాళ పరిశ్రమను క్రిమినల్ గ్యాంగ్స్ నియంత్రిస్తున్నాయని, తమకు లొంగని మహిళలను వేధిస్తున్నారని స్పష్టం చేసింది. కొంతమంది నిర్మాతలు, దర్శకులు, నటులు, ప్రొడక్షన్ కంట్రోలర్లతో కూడిన "పవర్ నెక్సస్"గా ఇండస్ట్రీ ఉందని కమిటీ తమ నివేదికో ఆరోపించింది. అవకాశాల కోసం రాజీ పడుతున్న మహిళలకు కోడ్ నేమ్స్ పెడుతున్నారని, లొంగని వారిని ఇండస్ట్రీకి దూరం చేస్తున్నారని నివేదికలో తెలిపింది. ఇండస్ట్రీలో పేరు పొందిన నటులు, దర్శకులు తమ స్వార్థానికి మహిళపై లైంగిక వేధింపులు, శారీరక సంబంధాల కోసం వేధిస్తున్నారని స్వయంగా నటీమణులు ఇచ్చిన వాంగ్మూలాలను తమ నివేదికలో పొందుపరిచింది. రాత్రిపూట మద్యం మత్తులో మగవాళ్లు గది తలుపులు తట్టడం ఆనవాయితీ ఉందని, కొని సందర్భాల్లో గది తలుపులు పగలగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని నివేదిక చెప్పింది.
ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే రాజీ పడటం, లొంగిపోవడం సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణంగా మారినట్లు కమిటీ తమ నివేదికలో పేర్కొంది. కొందరు అవసరం లేకున్నా అడ్వాన్స్‌గా డబ్బులు ఇచ్చిన నటీమణులను లొంగతీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, డబ్బులు ఇచ్చి పరోక్షంగా 'అడ్జస్ట్ మెంట్ ' అడుగుతున్నట్టు చెప్పింది. ఒకవేళ వారు వినకపోతే అవకాశాలు రావంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇండస్ట్రీలో తెరవెనక ఆడవాళ్లు ఇలాంటి ఘోరాలు ఎన్నో జరుగుతున్నాయన హేమ కమిటీ తమ నివేదిక తేల్చిచెప్పింది. దీంతో హేమ కమిటీ నివేదిక ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. దీనిపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. మాలీవుడ్‌లాగే ఇతర ఇండస్ట్రీలోనే ఇలా కమిటీని నియమించి చీకటి కోణాలను బట్టబయలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: తెలుగులో కీర్తి సురేష్ రఘు తాత సినిమా - నేరుగా ఓటీటీలో రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..