అన్వేషించండి

Raghu Thatha: తెలుగులో కీర్తి సురేష్‌ రఘు తాత సినిమా - నేరుగా ఓటీటీలో రిలీజ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. 

Raghu thatha Movie OTT: కీర్తి సురేష్‌ నటించి లేటెస్ట్‌ తమిళ చిత్రం రఘు తాత. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కాబోతోంది.

Keerthy Suresh Raghu thatha Movie OTT: 'మహానటి' కీర్తి సురేష్‌ నటించిన లేటెస్ట్‌ కామెడీ మూవీ 'రఘుతాత'. తమిళ్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా థియేటర్లో విడుదలైంది. కీర్తీ సురేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు సుమన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇందులో కీర్తి హిందీ భాషను వ్యతిరేకించే యువతిగా కనిపించింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రవీంద్ర విజయ్, ఎమ్మెస్‌ భాస్కర్‌ ఆనంద్‌ సామి, దేవదర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా హిందీ భాష‌కు వ్య‌తిరేకంగా తెరకెక్కించారు. థియేటర్లో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. కోలీవుడ్ ఆడియన్స్‌ బాగా ఆకట్టుకుంది. అక్కడ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో రిలీజ్‌కు రెడీ అవుతుందని సమాచారం. 

అయితే థియేటర్లో కాకుండా నేరుగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను ప్రముఖ జీ5 సంస్థ సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం, క‌న్న‌డ భాషల్లో ఈ సినిమాను జీ5 ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసిన‌ట్లు  సమాచారం. ఇక ఈసినిమాను సెప్టెంబ‌ర్ మొదటి వారం లేదా  సెప్టెంబర్‌ 14న ఓటీటీలో తెలుగు వెర్షన్‌ డైరెక్ట్‌గా విడుదల అవుతుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. 

బ్యాంక్‌ ఉద్యోగిగా కీర్తి

ఇందులో కీర్తి సురేష్‌ స్వాతంత్ర భావాలు కలిగిన కాయ‌ల్ విజీ  అనే బ్యాంక్‌ ఉద్యోగి పాత్రలో కనిపించింది. తను పనిచేసే చోట హిందీ భాష త‌ప్ప‌నిస‌రి అనే రూల్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసే యువ‌తిగా తన పాత్రలో అదరగొట్టింది. ఇందులో కీర్తి నటనకు విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. ఆమె నటన చాలా న్యాచులర్‌గా ఉందని, ఇది కీర్తి సినిమా అంటూ ఫ్యాన్స్‌ చెబుతున్నారు. కాయల్‌ విజీగా బ్యాంక్‌ ఉద్యోగి అయిన కీర్తి కా పాండియ‌న్ అనే మారు పేరుతో హిందీ భాషకు వ్యతిరేకగా ర‌చ‌న‌లు చేస్తుంది. ఆ ర‌చ‌న‌ల ద్వారా ఆమె జీవితంలోకి త‌మిళ్ సెల్వ‌న్ వ‌స్తాడు. త‌మిళ్‌సెల్వ‌న్ ఎవ‌రు? హిందీ రూల్ కార‌ణంగా వృత్తిప‌రంగా  ఆమె ఎదుర్కొన్న సమస్యలు నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

ఇక ఊహించని విధంగా తన జీవితంలోకి వచ్చిన త‌మిళ్ సెల్వ‌న్‌తో పెళ్లికి సిద్ధ‌ప‌డ్డ కాయ‌ల్‌కు అప్పుడే అత‌డి గురించి ఓ షాకింగ్ నిజం తెలుసుకుంది. హిందిను వ్య‌తిరేకించిన కాయల్‌.. హిందీ ఎగ్జామ్ రాయాల‌ని ఎందుకు అనుకుంది? ఆమె నిర్ణయం వెనక ఏముంది? అనేది ఈ రఘుతాత కథ. కీర్తి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ నటిస్తుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో 'బేబి జాన్‌' చిత్రం చేస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇందులో కీర్తి యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ సరసన హీరోయిన్‌గ నటిస్తుంది. 

Also Read: రామ్‌ చరణ్‌తో సెల్ఫీ - కల నెరవేరిందన్న మెల్‌బోర్న్‌ మేయర్‌ నిక్ రీస్, పోస్ట్‌ వైరల్‌

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?
ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?
Jana Nayagan Collections: 'జన నాయకన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... ఆదివారం విజయ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
'జన నాయకన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... ఆదివారం విజయ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
This Week Theatrical Releases : శ్రీనివాస మంగాపురం To హాలీవుడ్ అవెయిటెడ్ విజువల్ వండర్ - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్
శ్రీనివాస మంగాపురం To హాలీవుడ్ అవెయిటెడ్ విజువల్ వండర్ - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్
Chennai Love Story Collections: ఆదివారం అదరగొట్టిన చెన్నై లవ్ స్టోరీ... ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
ఆదివారం అదరగొట్టిన చెన్నై లవ్ స్టోరీ... ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget