రియా చక్రవర్తి గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రియా పేరు బాగా వినిపించింది అంతేకాదు ఈ కేసులో రియా ప్రధాన నిందితురాలిగా జైలుకు కూడా వెళ్లింది ఆ తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన ఆమె ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టింది ఈ క్రమంలో రియా ముంబై రోడ్లో బైక్‌పై ఓ వ్యక్తితో చక్కర్లు కొడుతూ కనిపించింది ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అతను ఎవరో కాదు జిరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అతడితో కొంతకాలంగా రియా రిలేషన్‌లో ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు వీరిద్దరు జంటగా రోడ్డుపై కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది కాగా నిఖిల్ కామత్‌కు ఇదివరకే పెళ్లై విడాకులు కూడా అయ్యాయి