అన్వేషించండి

Big Beautiful Bill: అమెరికా పార్లమెంటులో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం- పంతం నెగ్గించుకున్న డొనాల్డ్ ట్రంప్

Donald Trump | డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మక బిల్లు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అమెరికాలో ఆమోదం పొందింది. ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య వివాదానికి దారితీసిన బిల్లు చట్టంగా మారుతోంది.

Big Beautiful Bill passed in us | వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన కోరుకున్నట్లుగానే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం లభించింది. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 218-214 ఓట్ల తేడాతో గురువారం అర్ధరాత్రి ఆమోదించారు. దీనిని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన అతి పెద్ద విజయంగా భావిస్తున్నారు.

ఇటీవల అమెరికా సెనెట్ లో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందడం తెలిసిందే. తాజాగా ప్రతినిధుల సభలోనూ బిల్లు పాస్ కావడంతో ఇది చట్టంగా మారుతుంది. ట్రంప్ పదవీకాలంలో ఈ బిల్లును చట్టంగా మార్చుకోవడాన్ని ముఖ్యమైన విజయంగా పరిగణిస్తారు. ఇరు సభలు ఆమోదం తెలిపిన బిల్లుపై త్వరలోనే అధ్యక్షుడు సంతకం చేయనున్నారు. ఈ బిల్లు విషయంలోనే ఎలాన్ మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. మా దేశం వదిలి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపో అని సైతం ట్రంప్ వ్యాఖ్యలు చేయడం విశేషం.

బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ప్రతినిధుల సభలోనూ ఆమోదం పొందిన తర్వాత వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ బిల్లుపై స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు భారీ పన్ను మినహాయింపు, వ్యయ తగ్గింపు బిల్లుపై సంతకం చేయనున్నారని తెలిపారు. జూలై 4న సంతకం తరువాత కార్యక్రమం ఉంటుందన్నారు. దాదాపు 800 పేజీలకు పైగా ఉన్న ఈ బిల్లును ఆమోదింపజేయడానికి డొనాల్డ్ ట్రంప్ చాలా కష్టపడ్డారని తెలిపారు.

బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అంటే ఏమిటి

అమెరికాలో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కీలకంగా మారనుంది. దీని ద్వారా దేశంలో ఆర్థిక సంస్కరణలకు ట్రంప్ శ్రీకారం చుట్టనున్నారు. 2017లో ఎత్తివేసిన పన్ను కోతలను శాశ్వతంగా కొనసాగించడానికి ప్రధాన వ్యయ బిల్లును ట్రంప్ తీసుకువచ్చారు. దాదాపు 4.5 ట్రిలియన్ డాలర్ల పన్నుల కోత ప్రస్తావించారు. సీనియర్ సిటిజన్లు కూడా 6000 డాలర్ల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. పిల్లల పన్ను క్రెడిట్‌ను కూడా 2200 డాలర్లకు పెంచవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సరిహద్దు భద్రత కోసం 350 బిలియన్ డాలర్లు ఖర్చు చేయవచ్చు.

వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఏముంది..

ఈ బిల్లు యొక్క ప్రధాన లక్ష్యం సబ్సిడీలలో, ఖర్చులలో, పన్ను మినహాయింపులలో కోత విధించడం. అదే సమయలో దీన్ని వైద్య రంగంలో కొన్ని సబ్సిడీల తగ్గింపు అని నమ్ముతారు. రుణ పరిమితిని కూడా 5 ట్రిలియన్ డాలర్లకు పెంచవచ్చు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కారణంగా పన్ను కోతలు, సైనిక వ్యయం, సరిహద్దు భద్రత మరింత బలోపేతం కావానికి అవకాశం ఉంది. 

బిల్లు ప్రకారం దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల ఆరోగ్య సంరక్షణ సబ్సిడీని సైతం రద్దు చేస్తారు. అమెరికాలోని నిరుపేదలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. మెడికేడ్, అఫోర్డబుల్ కేర్ యాక్ట్‌లో ప్రతిపాదనల కారణంగా 2034 నాటికి దాదాపు 1.2 కోట్ల మంది ఆరోగ్య బీమాను కోల్పోయే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Inter Exams: ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
Chandrababu UAE Tour Schedule: నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
Stock Market Holiday: నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
Advertisement

వీడియోలు

6 Ball Over Behind Story | 6 బాల్ ఓవర్ కోసం ఇంగ్లండ్-ఆసీస్ మధ్య దశాబ్దాల ఫైట్‌ జరిగిందా? | ABP Desam
గంభీర్-గిల్ వల్లే అంతా! ఇలా అయితే సిరీస్ కూడా కష్టమే!
స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ సింగ్.. ఇద్దరికీ ఎంత తేడా?
ఇండియా మ్యాచ్.. రూ.60కే టికెట్
గంభీర్ వల్లే టీమిండియా ఓడింది: అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Inter Exams: ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
Chandrababu UAE Tour Schedule: నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
Stock Market Holiday: నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
Ocean’s Deepest Secrets : మనిషికి తెలియని రహస్య ప్రపంచం.. అసలు సముద్రంలో ఏముంది? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు
మనిషికి తెలియని రహస్య ప్రపంచం.. అసలు సముద్రంలో ఏముంది? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు
Nara Lokesh Australia Tour: ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి- వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్
ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి- వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్
AP and Telangana Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, ఏపీలో వారం రోజులు, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, ఏపీలో వారం రోజులు, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
Home Minister Anita: డీఎస్పీ జయసూర్యపై నివేదిక మా దగ్గర ఉంది- చర్యలు ఖాయం - హోంమంత్రి అనిత ప్రకటన
డీఎస్పీ జయసూర్యపై నివేదిక మా దగ్గర ఉంది- చర్యలు ఖాయం - హోంమంత్రి అనిత ప్రకటన
Embed widget