అన్వేషించండి

Nara Lokesh Australia Tour: ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి- వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్

Nara Lokesh Australia Visit: ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయాలని వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్ ను ఏపీ మంత్రి నారా లోకేష్ కోరారు.

ఆస్ట్రేలియా (గోల్డ్ కోస్ట్): ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్) మార్నీ వాట్సన్ తో గోల్డ్ కోస్ట్ క్యాంపస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ స్పోర్ట్స్ కళాశాలలో అధునాతన క్రీడా సౌకర్యాలను పరిశీలించారు. గ్రిఫిత్ వర్సిటీ ప్రత్యేకతల గురించి మార్నీ వాట్సన్ వివరాలు తెలియజేశారు.. 1975లో స్థాపించిన తమ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అగ్రశ్రేణి పబ్లిక్ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉందని చెప్పారు.

2027లో బ్రిస్బేన్‌లో కొత్త క్యాంపస్ ఏర్పాటు

క్వీన్స్ ల్యాండ్ లో యూనివర్సిటీకి గల 5 క్యాంపస్ లలో 50వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. సామాజిక న్యాయం (Social justice), స్థిరత్వం, ఆవిష్కరణ (Innovation) రంగాల్లో పేరుగాంచిన తమ విశ్వవిద్యాలయం 2027లో బ్రిస్బేన్ సీబీడీలో కొత్త క్యాంపస్ ప్రారంభించబోతోందని తెలిపారు. భారత్ లో ఐఐటీ రూర్కీతో కలిసి సంయుక్త పరిశోధన, స్టూడెంట్ ఎక్స్చేంజి కార్యక్రమాలు, ఆరోగ్యం, నీటివనరులు, టెక్నాలజీ రంగాల్లో అకడమిక్ భాగస్వామ్యం వహిస్తున్నట్లు చెప్పారు. 


Nara Lokesh Australia Tour: ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి- వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్

ఇండియాలో ఏపీలో సెంటర్ ఏర్పాటు చేయాలని కోరిన నారా లోకేష్

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్– గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేసేలా గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా సెంటర్ లేదా హబ్ ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయండి. సిలబస్ రూపకల్పన, నైపుణ్య ధృవీకరణ, గ్లోబల్ అకడమిక్ ప్రమాణాల కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు, APSSDC (ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్)తో భాగస్వామ్యం వహించండి.


Nara Lokesh Australia Tour: ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి- వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్

‘పునరుత్పాదక శక్తి, ప్రజారోగ్యం, వాతావరణ స్థితిస్థాపకత, నీటి నిర్వహణ రంగాల్లో సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు ప్రారంభించండి. గ్రిఫిత్ యూనవర్సిటీ, ఏపీలోని ప్రముఖ విద్యాసంస్థల మధ్య డ్యూయల్ డిగ్రీ లేదా ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయండి. (ఉదా: SRM– AP, ఆంధ్రా యూనివర్సిటీ, VIT–AP ). స్కాలర్‌షిప్‌లు, ఫ్యాక్టీ, విద్యార్థుల అభివృద్ధికి ఎక్స్చేంజి కార్యక్రమాలను ప్రోత్సహించడం). ఈ ఏడాది నవంబర్ 14,15 తేదీల్లో ఏపీలోని విశాఖ వేదికగా నిర్వహించే పార్ట్ నర్ షిప్ సమ్మిట్ – 2025, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫోరమ్ సమావేశాలకు హాజరుకావాలి. గ్రిఫిత్ విశ్వవిద్యాలయ ఆవిష్కరణ, స్టార్టప్ మద్దతునిచ్చేలా ఆంధ్రప్రదేశ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ తో కలసి పనిచేయాలని’ మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget