One Big Beautiful Bill: ప్రధాన వ్యయ బిల్లుకు అమెరికన్ సెనేట్ ఆమోదం, ఎలాన్ మస్క్‌ను దెబ్బకొట్టిన డొనాల్డ్ ట్రంప్
వివాదాస్పద వ్యయ కోతలు, పన్ను ఎత్తివేతలకు సంబంధించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు ఇది గట్టిదెబ్బ.

US Senate Passes One Big Beautiful Bill : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకున్న ప్రధాన వ్యయ బిల్లు (వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు)ను అమెరికా సెనేట్ మంగళవారం నాడు (జులై1న) ఆమోదించింది. 18 గంటలకు పైగా ఈ ఓటింగ్ కొనసాగింది. అమెరికా సెనేటర్లు దాదాపు 1,000 పేజీల బిల్లులో అనేక సవరణలను ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లులోని అంశాలపై చర్చించారు. ఆపై ఓటింగ్ జరగగా 50- 50 ఓట్లు వచ్చిన సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నిర్ణయాత్మక ఓటు వేసి 51-50తో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందడంలో కీలకంగా వ్యవహరించారు.
పన్ను కోతలు, సైనిక వ్యయం
అమెరికా సెనెట్ లో ప్రవేశపెట్టిన తాజా బిల్లును డొనాల్డ్ ట్రంప్ "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్" అని పిలిచేవారు. అతని మొదటి పదవీకాలంలో పన్ను కోతలను (Tax exemption) 4.5 ట్రిలియన్ డాలర్ల వ్యయం ఉండాలని దీని లక్ష్యం. దాంతోపాటు సైనిక వ్యయాన్ని పెంచడం, ప్రజలను పెద్ద ఎత్తున వారి దేశాలకు తరలించడం (Deportation), సరిహద్దు భద్రతకు నిధులు సమకూర్చడం లాంటి అంశాలు బిల్లులో ఉన్నాయి.
అమెరికా రుణాలు..
న్యూస్ ఏజెన్సీ AFP ప్రకారం, ఈ చట్టం రాబోయే 10 ఏళ్లలో అమెరికా రుణం 3.3 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉంది. అమెరికా సెనేట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందడం ట్రంప్ పరిపాలనలో ఒక ముఖ్యమైన చర్యగా చెప్పవచ్చు. ఈ బిల్లు శుక్రవారం (జులై 4) నాటికి చట్టంగా మారాలని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికా ఇండిపెండెన్స్ డే కంటే ముందుగా, ఆ సమయానికి దీన్ని అమలు చేయవచ్చు.
వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అమెరికా పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (ప్రతినిధుల సభ) వెళుతుంది. ఇక్కడ కొందరు రిపబ్లికన్ సభ్యులు బిల్లుపై ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులో ఒక ప్రతిపాదన ప్రకారం దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల ఆరోగ్య సంరక్షణ సబ్సిడీని రద్దు చేస్తారు. దానివల్ల నిరుపేదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
పేదల ఆరోగ్య సేవలపై ప్రభావం
నిపుణులు మెడికేడ్, అఫోర్డబుల్ కేర్ యాక్ట్‌లో ప్రతిపాదిత కోతల కారణంగా 2034 నాటికి అమెరికాలో దాదాపు 1.2 కోట్ల మంది ఆరోగ్య బీమాను కోల్పోయే అవకాశం ఉంది.
మస్క్ బెదిరింపులు
టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ బెదిరింపులకు దిగారు. ట్రంప్ ప్రభుత్వం కనుక 'బిగ్ బ్యూటిఫుల్ బిల్' ఆమోదించినట్లయితే, తాను కొత్త పార్టీని స్థాపిస్తానని చెప్పారు. ట్రంప్ వ్యయ బిల్లు ఆమోదం పొందితే 'అమెరికా పార్టీ' వెంటనే ఎస్టాబ్లిష్ చేస్తాను. దేశానికి డెమోక్రటిక్-రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరం. బిల్లు ఆమోదం పొందిన క్రమంలో ట్రంప్, మస్క్ మధ్య రెండవ రౌండ్ చర్చలు జరగడం కష్టమే అనిపిస్తుంది.
దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాలి: ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఎలాన్ మస్క్ ను హెచ్చరిస్తూ ఇలా రాశారు, 'అధ్యక్ష పదవికి మద్దతు తెలపడానికి చాలా ముందుగానే నేను EV ఆదేశాలకు వ్యతిరేకమని మస్క్ తెలుసుకున్నాడు. ఎలక్ట్రిక్ కార్లు బాగానే ఉన్నాయి, కానీ ప్రతి అమెరికా పౌరుడు వాటిని కొనాలని మనం బలవంతం చేయకూడదు. ఇప్పటివరకూ చాలా సబ్సిడీలు పొందాడు. ఇకనుంచి అది కుదరదు. ఈవీ వెహికల్స్ ఉత్పత్తితో పాటు స్పేస్ కార్యక్రమాలు నిలిపివేసి మస్క్ తన దేశం దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంటుంది' అని ట్రంప్ రాసుకొచ్చారు.






















