అన్వేషించండి

US Attacks Iran: ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు

West Asia War Updates | హర్మూజ్ జలసంధి వద్ద గస్తీ కాస్తున్న అమెరికా అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేయడంతో యూఎస్ ఆర్మీ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ట్రంప్ ముందుగానే ఇరాన్‌ను హెచ్చరించారు.

US Apache Helicopter | టెహ్రాన్: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇదివరకే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయగా, టెహ్రాన్ సైతం ప్రతీకార దాడులకు దిగింది. మంగళవారం నాడు అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ (AH 64)ను ఇరాన్ కూల్చివేయడం అగ్రరాజ్యంతో ఉద్రిక్తతను మళ్లీ పెంచింది. హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతీకారంగా యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్‌లోని టెహ్రాన్ సహా పలు వ్యూహాత్మక ప్రాంతాలపై డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులు ప్రారంభించింది. హర్మూజ్‌ సమీపంలోని ఖేష్మ్‌ దీవిలో బాంబు దాడుల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్‌ మీడియా రిపోర్ట్ చేసింది.  

ఇరాన్‌కు చెందిన కేశమ్, బందర్ అబ్బాస్ నగరాల్లోని పలు కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం విరుచుకుపడింది. అమెరికాకు చెందిన అడ్వాన్స్‌డ్ అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేయడాన్ని తీవ్రంగా పరిగణించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అందుకు తగిన సమాధానం చెబుతామని, ఇరాన్ మూల్యం చెల్లించుకోకతప్పదని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ ద్వారా ఇదివరకే హెచ్చరించారు. ఆ తరువాత కొన్ని గంటలకే అమెరికా బలగాలు ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై విరుచుకుపడుతున్నాయి. 

ఒమన్ తీరంలో హర్మూజ్ జలసంధి వద్ద గస్తీ కాస్తున్న అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనకు ఇరానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఈ క్రమంలో మంగళవారం (జూన్ 9) నుండి ఇరాన్‌పై దాడులు ప్రారంభించినట్లు అమెరికా సైన్యం అధికారికంగా తెలిపింది. సోషల్ మీడియా ద్వారా అమెరికన్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఓ ప్రకటన విడుదల చేసింది. అకారణంగా ఇరాన్ చేసిన దాడులకు, ఉద్దేశపూర్వక చర్యలకు ఇదే సరైన సమాధానమని స్పష్టం చేసింది.

Also Read: H1B Visa Fee: హెచ్‌1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు చట్టవిరుద్ధం.. డొనాల్డ్ ట్రంప్‌నకు ఫెడరల్ కోర్టు షాక్

హెలికాప్టర్ కూల్చివేతకు ఇరానే బాధ్యత వహించాలని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే అమెరికా బలగాలు రంగంలోకి పలు ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. అమెరికా దాడుల తీవ్రతకు హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లోని ఒక ఇరాన్ ద్వీపం ఖేష్మ్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది.

ఇరాన్ లక్ష్మణరేఖ దాటిందా..

హర్మూజ్ జలసంధి సమీపంలో తమ హెలికాప్టర్‌ను కూల్చివేయడం ద్వారా ఇరాన్ లక్ష్మణ రేఖ దాటిందని, ఇందుకుగానూ అమెరికా బదులిచ్చి తీరుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఉద్రిక్తతలపై ఇరాన్ దౌత్యవేత్త స్పందించారు. తమ దేశ సరిహద్దుల సమీపంలో విదేశీ సైనిక బలగాలకు ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరించారు. అయితే శాంతి చర్చలు జరుగుతాయని, త్వరలోనే యుద్ధానికి పూర్తిగా ముగింపు పలుకుతామని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న సమయంలోనే అటు ఇరాన్, అమెరికా మధ్య, మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సైతం పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అసలే మూడు నెలలకు పైగా చమురు సంక్షోభం నెలకొనడంతో ఈ పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Also Read: Chilkur Balaji Visa Temple: చిలుకూరు బాలాజీ పవర్‌ను చూసి భయపడుతున్న అమెరికన్ సెనెటర్ - పని చేతకాక చిందులు తొక్కుతున్నారా? 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
Embed widget