అన్వేషించండి

H1B Visa Fee: హెచ్‌1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు చట్టవిరుద్ధం.. డొనాల్డ్ ట్రంప్‌నకు ఫెడరల్ కోర్టు షాక్

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును అమెరికా ఫెడరల్‌ కోర్టు కొట్టేసింది. కాంగ్రెస్‌ ఆమోదం లేనందున చట్ట విరుద్ధమైన పన్నుతో సమానమని జడ్జి తీర్పునిచ్చారు.

వాషింగ్టన్: హెచ్‌1బీ వీసాలకు ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది.  విదేశాలకు చెందిన ప్రొఫెషనల్స్‌కు భారీ ఊరట కలిగిస్తూ అమెరికా ఫెడరల్ కోర్టు సోమవారం నాడు కీలక తీర్పును వెలువరించింది. హెచ్‌1బీ వీసాల కోసం డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన లక్ష డాలర్ల భారీ ఫీజును బోస్టన్‌లోని ఫెడరల్‌ కోర్టు కొట్టేసింది. ఈ నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. 

అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం తెలపకుండా ఇలాంటి భారీ ఫీజులు వసూలు చేయడం చట్ట విరుద్ధమైన పన్ను కిందకే వస్తుందని, అందువల్ల ఇది చెల్లదని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి లియో సొరొకిన్‌ సోమవారం నాడు తన తీర్పులో వెల్లడించారు. కాగా, గత సెప్టెంబరులో ట్రంప్‌ ప్రభుత్వం విదేశీయులకు జారీ చేసే తాత్కాలిక వలస వీసా అయిన హెచ్‌1బీ ప్రక్రియలో ఒక వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుంది. దీని ప్రకారం వీసాకు ఎంపికైన విదేశాలకు చెందిన నిపుణులు లక్ష డాలర్ల ఫీజును చెల్లించాల్సి ఉంటుందని కండీషన్ పెట్టింది. అయితే, ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌ బోస్టన్‌ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన జడ్జి, ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.

విచారణ అనంతరం జడ్జి జస్టిస్ లియో సొరొకిన్ మాట్లాడుతూ.. విదేశీ ప్రొఫెషనల్స్ అమెరికాకు రావడానికి 1 లక్ష డాలర్ల ఫీజు చెల్లించడం కేవలం పెనాల్టీ కాదు, అది ముమ్మాటికీ వారి నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్.  అమెరికా పార్లమెంట్ అనుమతి లేకుండా ఇలా  పన్నుల విధింపుపై నిర్ణయం తీసుకునే అధికారం దేశ అధ్యక్షుడికి లేదు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని’ స్పష్టం చేస్తూ ఆ హెచ్1బీ వీసా ఫీజును రద్దు చేశారు.

Also Read: Chilkur Balaji Visa Temple: చిలుకూరు బాలాజీ పవర్‌ను చూసి భయపడుతున్న అమెరికన్ సెనెటర్ - పని చేతకాక చిందులు తొక్కుతున్నారా?

లక్ష డాలర్లు చెల్లించిన 2 లక్షల మంది

అమెరికాలో పనిచేయడానికి ఈ ఏడాది 2 లక్షల కంటే ఎక్కువ మంది విదేశీయులు హెచ్-1బీ వీసా కోసం ఒక లక్ష డాలర్ల ఫీజు చెల్లించారు. ప్రయారిటీ బేసిస్ తమ దరఖాస్తులను త్వరగా పరిశీలించే ఆప్షన్ కు రెండు లక్షల కంటే ఎక్కువ మంది ఒక లక్ష అమెరికన్ డాలర్ల ఫీజు చెల్లించారని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) మంత్రి మార్క్‌వైన్ ముల్లిన్ వారం రోజుల కిందట తెలిపారు.

సెనేట్ అప్రాప్రియేషన్స్ సబ్‌కమిటీ (వినియోగ ఉపసంఘం) సమావేశంలో మార్క్‌వైన్ ముల్లిన్ జూన్ 2, 2026న ఈ సమాచారాన్ని అందించారు. ఆర్థిక సంవత్సరం 2026లో హెచ్-1బీ వీసా కోసం డిహెచ్ఎస్ (DHS) కు సుమారు 2.86 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతపై అమెరికా సెనేటర్ సుసాన్ కాలిన్స్ ఆందోళన వ్యక్తం చేయగా.. ఆయన ఈ వివరాలను వెల్లడించారు. మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తుదారులలో 2 లక్షల మంది లక్ష డాలర్లు చెల్లించారని, వారి దరఖాస్తులను మరింత వేగంగా పరిష్కరిస్తాం అన్నారు. 

ఒక లక్ష డాలర్ల రుసుము చెల్లించిన దరఖాస్తుల పరిశీలన సుమారు 15 రోజుల్లో పూర్తవుతుందని, అదే సాధారణ దరఖాస్తుల పరిశీలనకు దాదాపు ఏడున్నర పడుతుందని ముల్లిన్ తెలిపారు. మైనే రాష్ట్రంలోని ఉత్తర భాగంలో ఉన్న ప్రెస్క్ ఐల్ అనే గ్రామీణ ప్రాంత ఆసుపత్రి, విదేశాల నుండి అత్యవసరంగా ఒక సర్జన్‌ను రప్పించడానికి ఈ భారీ ఫీజును చెల్లించాల్సి వచ్చిందని సెనేటర్ కాలిన్స్ ఉపసంఘానికి తెలిపారు. 

Also Read: H-1B Visa Pause: అమెరికాలో హెచ్‌-1బి వీసాల జారీకి బ్రేక్? భారతీయ టెక్కీలకు బిగ్ షాక్! పూర్తి వివరాలు ఇవే!

ఈ సందర్భంగా కాలిన్స్ మాట్లాడుతూ.. 'ఏదైనా ఒక ప్రాంతంలో తగిన డాక్టర్లు అందుబాటులో లేరని నిరూపించగలిగితే, అలాంటి వైద్య నిపుణులకు (మెడికల్ ప్రొఫెషనల్స్) ఈ ఛార్జీల నుండి మినహాయింపు ఇచ్చే అంశాన్ని మీరు పరిశీలిస్తారా?' అని ప్రశ్నించారు. దీనిపై ముల్లిన్ స్పందిస్తూ, ఈ విషయమై సాధ్యమైన పరిష్కారాలను అన్వేషిస్తామని, ఇలాంటి కేసులలో పరిస్థితులను బట్టి ఏమైనా సడలింపులు ఇవ్వవచ్చా అనే పరిశీలిస్తామన్నారు. 

కాలిన్స్ ఇంకా మాట్లాడుతూ.. 'కాలిఫోర్నియా, సిలికాన్ వ్యాలీలలో పనిచేయడానికి వేరే దేశం నుండి నిపుణులను తీసుకురావడానికి, ఉత్తర మైనేలోని ఒక గ్రామీణ ఆసుపత్రికి అత్యంత అవసరమైన సర్జన్‌ను తీసుకురావడానికి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉందని' అన్నారు. అలాస్కాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ లీసా ముర్కోవ్స్కీ తమ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల పాఠశాలల్లో టీచర్ల కొరత సమస్యను లేవనెత్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Iran War: జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Temple Dating: దేవాలయాల్లో డేటింగ్ క్యాంపులు జనాభాను పెంచుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే డిస్కషన్!
దేవాలయాల్లో డేటింగ్ క్యాంపులు జనాభాను పెంచుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే డిస్కషన్!
US Iran War: ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget