అన్వేషించండి

Taliban: బహిరంగంగా నిలబెట్టి కాల్చి చంపారు - తాలిబన్ల మరణశిక్షలు - నాటి ఆప్గానే మళ్లీ !

Afghan: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ఘోరమైన శిక్షలు విధిస్తున్నారు. తాజాగా ఓ మరణ శిక్షను బహిరంగంగా కాల్చివేత ద్వారా అమలు చేశారు.

Taliban carries out sixth public execution: ఆఫ్గానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారం చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్లు ప్రపంచ దేశాల నుంచి ఆగ్రహం వస్తుందని కాస్త సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ వారు రెచ్చిపోతున్నారు. బహిరంగ మరణశిక్షలు అమలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆరుగురికి మరణశిక్షలు విధించారు.తాజాగా ఓ వ్యక్తికి విధించిన మరణశిక్ష అత్యంత ఘోరంగా ఉంది. అందరి ముందు ... నిలబెట్టి మూడు బుల్లెట్లతో కాల్చి చంపారు. ఇలా చంపడాన్ని ఆ వ్యక్తి కుటంబసభ్యులు కూడా ఎదురుగా ఉండి చూడాల్సి వచ్చింది. అంటే వారి కుటుంబసభ్యుడ్ని వారి కళ్ల ముందే కాల్చి చంపేశారు. అదే మరణశిక్ష అమలు చేయడం. శిక్ష అతనికే కాక అతని కుటుంబం మొత్తానికి విధించారన్నమాట.                          

కెనడా మాదే తెల్లోళ్లు యూరోప్ వెళ్లిపోవాలి- ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్ ! తిక్క కుదిరినట్లే !

తాలిబన్ల చట్టాలు అత్యంత ఘోరంగా ఉంటాయి. చనిపోయిన వ్యక్తిని కూడా ఉరేసి చంపడం వంటి చట్టాలతో వారు క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రస్తుతం బ హిరంగంగా కాల్చి చంపిన వ్యక్తి చాలా కాలంగా జైల్లో ఉంటున్నారు. ఆయన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. అతనే హత్య చేసినట్లుగా తాలిబన్ల మిలటరీ కోర్టులు నిర్ధారించి కాల్చి చంపేశాయి. ఇటీవలి కాలంలో ఆరుగురికి ఇలా మరణ శిక్షలు విధించాయి. తాలిబన్లపై ప్రజలు తిరగబడకుండా వారు అప్పుడప్పుడూ జైళ్లల్లో ఉన్న ఖైదీలకు శిక్షలు ఖరారు చేసి ఇలా అందరి ముందు కాల్చి చంపి భయపెడుతూ ఉంటారన్న విమర్శలు కూడా ఉన్నాయి.       

1999లో కూడా తాలిబన్లు ఆప్ఘాన్‌ను పరిపారిస్తూ ఉండేవారు. అప్పట్లో ఇంకా ఘోరమైన శిక్షలు విధించేవారు. మహిళల్ని కూడా వదిలి పెట్టకుండా చంపేసేవారు. ఇలాంటి శిక్షలు అప్పట్లో అంతర్జాతీయ సమాజాన్ని కదిలించాయి. నిజానికి ఆప్ఘాన్‌లో ఏమి జరుగుతుందో అంత తేలికగా బయటకు రాదు. అక్కడ పూర్తిగా తాలిబన్ రూల్స్ అమలవుతూ ఉంటాయి. ఇంటర్నెట్ అనేది దాదాపుగా ఉండదు. సోషల్ మీడియాను ఎవరూ ఉపయోగించుకోలేరు. మహిళలపై కట్టుదిట్టమైన అణచివేత ఉంటుంది. ఉల్లంఘిస్తే తీవ్ర శిక్షలకు గురవుతారు. అతి క్,టం మీద అక్కడి సమాచారం అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలుసుకుని బయట ప్రపంచానికి అందిస్తూంటాయి.             

Also Read; టెలిగ్రామ్ సీఈవో రియల్ విక్కీ డోనర్ - స్పెర్మ్ ఇచ్చి ఉచితంగా ఐవీఎఫ్ చేయిస్తాడట - ఒకటే కండిషన్

తాలిబన్లు రెండో సారి ఆప్ఘన్ ను ఆక్రమించుకోక ముందు ప్రజాప్రభుత్వం ఉండేది. ఆ సమయంలో మహిళలు యథేచ్చగా విద్యా, ఉద్యోగ అవకాశాలను పొందేవారు. ఇప్పుడు అలాంటి వారు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. తాలిబన్ల రూలింగ్‌పై ప్రపంచదేశాలు సైలెంట్ గా ఉంటున్నాయి. ఎవరూ జోక్యం చేసుకోవడండ లేదు.                    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Embed widget